అక్షరటుడే, ఎల్లారెడ్డి: Vaishya Leaders Felicitation | ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం, రాష్ట్ర ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక (international vaishya federation) ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి (Yellareddy) మున్సిపల్ ఎనిమిదో వార్డు కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తాను ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ వైశ్య ప్రజా ప్రతినిధులకు హైదరాబాద్లోని (hyderabad community program) ముషీరాబాద్ వైశ్య హాస్టల్లో (mushirabad vaishya hostel event) ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయనను సత్కరించారు.
Vaishya Leaders Felicitation | ఇటీవల జరిగిన ఎన్నికల్లో..
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (aryavaishya community event) రాష్ట్రంలోని ఆరు మున్సిపాలిటీల్లో (telangana municipal leaders) ఎన్నికైన ఛైర్మన్లు, ఆరుగురు మున్సిపల్ వైస్ ఛైర్మన్లు, 49 మంది వార్డు కౌన్సిలర్లను (vaishya political leaders) ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ (tg venkatesh) మాట్లాడుతూ వైశ్యులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపారంతో పాటు రాజకీయాల్లో రాణించాలని, రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించే వైశ్యులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. దానధర్మాల్లో ముందుండే వైశ్యులు రాజకీయాల్లో కూడా ముందుకు రావాలని సూచించారు.
Vaishya Leaders Felicitation | ప్రజాప్రతినిధులను..
నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ప్రజాప్రతినిధులకు శాసనమండలి సభ్యుడు బుగ్గారపు దయానంద్, ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సెంట్రల్ కమిటీ అడ్వైజర్ గంజి రాజమౌళి, రాష్ట్ర ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చంద్రప్రకాష్ గుప్తా, రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ ఛైర్పర్సన్ కల్వ సుజాత తదితరులు ఘనంగా సన్మానించారు. వైశ్య ప్రముఖులు దివంగత భూపతి కృష్ణమూర్తి శతజయంతి ఉత్సవంలో భాగంగా ప్రజాప్రతినిధులను సన్మానించినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ సికింద్రాబాద్కు చెందిన వైశ్య ప్రముఖులతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్

