అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vande Bharat Food Issue | వందే భారత్ రైలు (Vande Bharat Train)లో అందించే ఆహారంలో పురుగు రావడం తీవ్ర కలకలం రేపింది. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహార నాణ్యతపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vande Bharat Food Issue | ఆహార నాణ్యతపై తరచు వివాదాలు
కేంద్ర ప్రభుత్వం (Central Government) వందే భారత్ రైళ్లను ఆధునిక హంగులతో రూపొందించిన విషయం తెలిసిందే. వేగంగా వెళ్లే ఈ రైళ్లలో టికెట్ ధరలు కూడా ఎక్కువే. అయితే అంతా బాగానే ఉన్నా.. ఈ రైళ్లలో పెట్టే ఆహార నాణ్యతపై తరచు వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్–ముంబై వందే భారత్ రైలులో ప్రయాణికులకు అందించిన భోజనంలో పురుగు ప్రత్యక్షం అయింది. ఒకే కోచ్‌లో ఇలాంటి ఘటనలే రెండు వెలుగుచూడటంతో ప్రయాణికులు భోజనం చేయడం ఆపేశారు. ఆహార సరఫరా సంస్థ ‘బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్స్’ (Brindavan Food Products)పై తక్షణమే తనిఖీలు నిర్వహించి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Vande Bharat Food Issue | గతంలో సైతం
వందే భారత్ రైళ్లలో గతంలో సైతం ఆహారంలో పురుగులు వచ్చిన ఘటనలు ఉన్నాయి. ఇటీవల పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో పెరుగు నాణ్యతకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. ప్రీమియం సర్వీస్ (Premium Service)లో ప్రయాణికులకు పురుగులు ఉన్న పాడైపోయిన పెరుగును వడ్డించారన్న ఆరోపణల నేపథ్యంలో ఐఆర్సీటీసీ అమూల్ సంస్థకు నోటీసులు కూడా ఇచ్చింది. రైలులో వడ్డించిన ఆహారం పరిస్థితిపై ప్రయాణికులు ఫిర్యాదులు చేసి, ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలను రైల్వే అధికారులతో పంచుకోవడంతో ఈ విషయం పరిశీలనకు వచ్చింది. దీంతో అధికారులు ఐఆర్‌సీటీకి రూ.10 లక్షలు, ప్రైవేట్ క్యాటరింగ్ కాంట్రాక్టర్‌కు రూ.50 లక్షల జరిమానా విధించారు. అయినా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటునే ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Om Birla impeachment rejection | లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం.. సీఈసీ గ్యానేష్ కుమార్‌పై ఇంపీచ్‌మెంట్ నోటీసు తిరస్కరణ
