Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Velugumatla Indiramma Houses | వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు.. మంజూరు పత్రాల పంపిణీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Velugumatla Indiramma Houses | వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు.. మంజూరు పత్రాల పంపిణీ

తెలంగాణ

Velugumatla Indiramma Houses | వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు.. మంజూరు పత్రాల పంపిణీ

వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. అర్హులైన 311 మంది పేదలకు స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 8:27 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Velugumatla Indiramma Houses

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Velugumatla Indiramma Houses | ఖమ్మం (Khammam) జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. అర్హులైన 311 మంది పేదలకు స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇంటి స్థలం ఉన్న 101 మందికి ఇళ్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఖమ్మం కలెక్టరేట్ (Khammam Collectorate)​లో మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.

Contents
  • Velugumatla Indiramma Houses | అనేక ఇబ్బందులు
    • Velugumatla Indiramma Houses | పట్టించుకోని బీఆర్​ఎస్​

వెలుగుమట్ల భూదాన్​ భూముల్లో ఉంటున్న వారి ఇళ్లను ఇటీవల ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. దాదాపు 700 కుటుంబాలను ఇళ్లు, గుడిసెలను అధికారులు తొలగించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా తాజాగా నిర్వాసితులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందించారు.

Velugumatla Indiramma Houses | అనేక ఇబ్బందులు

భూధాన్ భూముల్లో నివాసం ఉంటున్న ప్రజలు కనీస అవసరాలు లేక అనేక ఇబ్బందులను పడ్డారని మంత్రి పొంగులేటి అన్నారు. అక్కడ కొందరు వ్యక్తులు ఒక ముఠాలా తయారై పట్టాలు ఇప్పిస్తామని పేదలను నమ్మించి మోసం చేశారన్నారు. బ్రోకర్ల మాటలు నమ్మిన ప్రజలు వారికి అధిక మొత్తంలో డబ్బులను ముట్టజెప్పారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న భూధాన్ భూములను సీసీఎల్, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పారు. పేదల కష్టం తెలిసిన ప్రజాప్రభుత్వం అర్హులను గుర్తించి వారికి న్యాయం చేయడానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందన్నారు.

velugumatla

Velugumatla Indiramma Houses | పట్టించుకోని బీఆర్​ఎస్​

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్ (BRS)​ వెలుగుమట్లలో కనీస సౌకర్యాలు కల్పించలేదని మంత్రులు అన్నారు. ఈరోజు మొసలి కన్నీరు కారుస్తూ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వస్తాం అనే ప్రధాన ప్రతిపక్ష నాయకులు పగటి కలలు మానుకోవాలని ఎద్దేవా చేశారు. వెలుగుమట్లలో ఇండ్ల నిర్మాణం పూర్తవ్వడానికి ముందే అన్ని వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

దీనిని కూడా చదవండి : Kavitha Land Protest | పేదల భూములను కబ్జా చేస్తున్న ప్రభుత్వం : కవిత

Telangana Summer Heat | మండుతున్న ఎండలు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
Hyderabad Timber Depot Fire | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం
Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి రిమాండ్​!
Sircilla Weavers Dues | నేత కార్మికుల విద్యుత్​ బకాయిలు రద్దు చేయాలి : కేటీఆర్​
Employee Pending Bills Release | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. పెండింగ్​ బిల్లుల విడుదల
TAGGED:Bhatti VikramarkaBhoodan Land IssueIndiramma HousesKhammam NewsPonguleti Srinivas ReddyTelangana GovernmentVelugumatla
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article IPL 2026 Schedule IPL 2026 Schedule | ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్​లో తలపడే జట్లు ఇవే..
Next Article Kamareddy Railway Modernization | Kamareddy Railway Modernization | రైల్వే ఆధునీకరణ పనులకు నిధులివ్వండి: కేంద్ర రైల్వే మంత్రికి ఎమ్మెల్యే వినతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?