అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijay Campaign Incident | తమిళనాడు (Tamil Nadu)లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, నటుడు విజయ్, పెరంబూర్, తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గాల్లో ఆదివారం ప్రచారం చేశారు.
ప్రచారంలో భాగంగా విజయ్ (TVK Chief Vijay) సైకిల్ తొక్కారు. కొంత దూరం వరకు ఆయన సైకిల్‌పై వెళ్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేశారు. తమ పార్టీ నేతలను గెలిపించాలని కోరారు. అయితే తమ అభిమాన నటుడు, నాయకుడు సైకిల్‌పై దగ్గరగా కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ క్రమంలో ఆయనపై పూల వర్షం కురిపించారు. కొందరు అభిమానులు రోడ్డుపైకి వచ్చి విజయ్‌పై పూలు చల్లారు.
Vijay Campaign Incident | భయపడ్డ విజయ్
కొందరు అభిమానులు ఒక్కసారిగా వచ్చి పూలు చల్లడంతో టీవీకే చీఫ్ విజయ్ భయపడిపోయారు. వెంటనే సైకిల్ ఆపి దిగిపోయారు. పరుగెత్తుకుంటూ వెళ్లి తన వాహనంలో ఎక్కారు. అనంతరం వాహనం మీద నుంచి ప్రచారం కొనసాగించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అయితే విజయ్ సైకిల్ దిగి పారిపోయిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారింది. సినీ నటులు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అలాంటి వారు రాజకీయాల్లో వస్తే ఇలాగే ఉంటుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు.
His Vizhupuram Run is so famous..
His fans created a mobile game based on that..
Next was Karur Run from Press & Media..
Now it’s Kanyakumari Run…🤗#TVK #Vijay #VizhupuramRun #KarurRun #KanyaKumariRun pic.twitter.com/DSeoqarC9l
— We Dravidians (@WeDravidians) April 12, 2026
ఇది కూడా చదవండి..: Asha Bhosle Death | మెలోడీ క్వీన్ ఆశా భోస్లే కన్నుమూత.. భారతీయ సంగీతానికి తీరని లోటు
