అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Rashmika Reception : హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం నటులు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ విందు వేడుక ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు.
Vijay Rashmika Reception : షబ్బీర్ అలీ హాజరు..
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు Mohammed Ali Shabbir తన కుమార్తె, ప్రభుత్వ న్యాయవాది షాజియా పర్వీన్‌తో కలిసి హాజరయ్యారు. వేదికపైకి చేరుకున్న ఆయన నూతన దంపతులను అభినందించారు. వారి వైవాహిక జీవితం సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. రాజకీయ నాయకులు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, వ్యాపార వేత్తలు వేడుకకు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవలే వివాహం..
ప్రముఖ టాలీవుడ్ నటుడు Vijay Deverakonda, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన Rashmika Mandanna వివాహ వేడుక ఇటీవల కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సాదాసీదాగా నిర్వహించారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. విస్తృత సంఖ్యలో అతిథులను ఆహ్వానించారు.
సంతోషకర వాతావరణంలో సాగిన రిసిప్షన్ వేడుకకు అతిథులు భారీగా తరలి వచ్చారు. నూతన దంపతులతో కలిసి ఫొటోలు దిగుతూ, శుభాకాంక్షలు తెలిపారు.

