అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Rashmika Sangeeth Pics | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ , నేషనల్ క్రష్ రష్మిక మంధాన (Vijay Rashmika Sangeeth Pics) ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లి అనంతర కార్యక్రమాలతో ఈ కొత్త జంట బిజీగా ఉంది. సోమవారం విజయ్ తన భార్య రష్మికతో కలిసి తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool District) తుమ్మెన్‌పేటలో సందడి చేశారు.
కొత్తగా నిర్మించిన ఇంటికి ఈ దంపతులు గృహప్రవేశం చేశారు. అనంతరం వేదపండితుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరైన ఈ వేడుకలో విజయ్–రష్మిక సంప్రదాయ వేషధారణలో ఆకట్టుకున్నారు.
Vijay Rashmika Sangeeth Pics | సంగీత్ పిక్స్‌తో సందడి
వ్రతం ముగిసిన తర్వాత గ్రామస్థులకు అన్నదానం నిర్వహించి, వేదికపై మాట్లాడిన విజయ్ పలు హామీలు ఇస్తూ తన మంచి మనసు చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా విజయ్ (Hero Vijay Deverakonda) తమ సంగీత్ వేడుకకు సంబంధించిన ప్రత్యేక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత నెల 24న జరిగిన సంగీత్ నైట్ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వాం… పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేశాం… ఎన్నో సర్‌ప్రైజ్‌లతో నిండిన అద్భుతమైన సాయంత్రం అంటూ విజయ్ భావోద్వేగంగా రాసుకొచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు వేడుక కొనసాగిందని పేర్కొన్నారు.
Vijay Rashmika Sangeeth Pics | లైఫ్‌లో బిగ్గెస్ట్ ఈవెంట్
సంగీత్ వేడుకలో విజయ్ బ్లూ వెల్వెట్ ఎంబ్రాయిడరీ శెర్వానీలో మెరిసిపోగా, రష్మిక (Rashmika Mandanna) క్రీమ్ కలర్ హెవీ లెహెంగాలో అందంగా కనిపించారు. ప్రత్యేక వాహనంలో ఎంట్రీ ఇవ్వడం, కజిన్స్ డ్యాన్స్‌తో హోరెత్తించడం, విజయ్ తల్లి ఎమోషనల్ అవ్వడం, కొత్త జంట ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ నవ్వుకోవడం వంటి హృద్యమైన క్షణాలను విజయ్ అభిమానులతో పంచుకున్నారు. ప్రత్యేకంగా రష్మికను పట్టుకుని విజయ్ చేసిన డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. విజయ్–రష్మిక అభిమానులు, సినీప్రియులు ఈ పిక్స్‌ను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. లైక్స్, కామెంట్స్‌తో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. “లైఫ్‌లో బిగ్గెస్ట్ ఈవెంట్‌లలో ఒకటైన సంగీత్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు” అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి, పెళ్లి వేడుకల తర్వాత కూడా ఈ జంట సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతూ అభిమానులను అలరిస్తూనే ఉంది.
The night filled with love, tears of joy, laughter, music, singing, glitters and us dancing through the night. ❤️
It was really the most fun night ever!!
From Vijju and I wanting to surprise each other..
to
family wanting to surprise us..
to
being fully excited and… pic.twitter.com/q7q4oHrl6y
— Rashmika Mandanna (@iamRashmika) March 3, 2026
ఇది కూడా చదవండి..: Rashmika Wedding Instagram | విరోష్ వివాహం ఇన్‌స్టా పోస్ట్.. కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక..

