Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vijay Rashmika Wedding | విరోష్ పెళ్లి సందడి : దేశవ్యాప్తంగా స్వీట్లు, దేవాలయాల్లో అన్నదానం…
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Vijay Rashmika Wedding | విరోష్ పెళ్లి సందడి : దేశవ్యాప్తంగా స్వీట్లు, దేవాలయాల్లో అన్నదానం…

సినిమా

Vijay Rashmika Wedding | విరోష్ పెళ్లి సందడి : దేశవ్యాప్తంగా స్వీట్లు, దేవాలయాల్లో అన్నదానం…

విజయ్​ దేవరకొండ, రష్మిక వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహ వేడుక సందర్భంగా ఈ జంట పలు నగరాల్లో స్వీట్ల పంపిణీ, ఆలయాల్లో అన్నదానం నిర్వహిస్తోంది.

Srinivas kolluri
Last updated: మార్చి 1, 2026 10:44 ఉద.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Vijay Rashmika Wedding

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijay Rashmika Wedding | టాలీవుడ్ క్యూట్ క‌పుల్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ గురువారం రాజస్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌ (Udaypur) ప్యాలెస్‌లో అత్యంత‌ వైభవంగా వీరి వివాహం జరిగింది.

Contents
  • Vijay Rashmika Wedding | మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్
    • Vijay Rashmika Wedding | మరోచిత్రంలో..

రాజుల పెళ్లిని తలపించేలా ఘనంగా జరిగిన ఈ వేడుకలో అత్యంత సన్నిహిత బంధుమిత్రులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకోగా, దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువెత్తుతోంది. తాజాగా ఈ కొత్త దంపతులు హైదరాబాద్‌కు చేరుకుని రిసెప్షన్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Vijay Rashmika Wedding | మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్

మార్చి 4న హైదరాబాద్‌ (Hyderabad)లో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొనే ఈ వేడుక టాలీవుడ్‌లో మరో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా, తమ ప్రేమకు, ఆశీస్సులకు ప్రతిగా దేశ ప్రజలకు ప్రత్యేక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని విరోష్ జంట నిర్ణయించింది. మార్చి 1న దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్లు (Sweets) పంపిణీ చేయడంతో పాటు దేవాలయాల్లో అన్నదానం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా తమ కృతజ్ఞతను తెలియజేస్తూ, “మా జీవిత ప్రయాణంలో ఈ దేశ ప్రజలందరూ ఒక భాగం. మా వివాహ సందర్భంగా మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు. ఈ ఆనందాన్ని మీతో పంచుకునేందుకు స్వీట్లు పంపుతున్నాం. వివిధ నగరాల్లోని దేవాలయాల్లో అన్నదానం నిర్వహిస్తున్నాం. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలి” అని పేర్కొన్నారు.

Vijay Rashmika Wedding | మరోచిత్రంలో..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, బీహార్ రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఈ స్వీట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్య దేవాలయాల్లో భక్తులకు అన్నదానం నిర్వహిస్తూ, అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. విజయ్, రష్మికల పరిచయం గీతా గోవిందం చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత డియ‌ర్ కామ్రేడ్ (Dear Comrade) సినిమాలో కలిసి నటించారు. ఈ రెండు చిత్రాల సమయంలోనే వీరి మధ్య ప్రేమ మొదలైందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏడేళ్ల ప్రేమ ప్రయాణం అనంతరం ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకుని జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ‘రణబాలి’ అనే చిత్రంలో మరోసారి కలిసి నటిస్తుండటం విశేషం.

vijay

ఇది కూడా చదవండి: Rashmika Wedding Instagram | విరోష్ వివాహం ఇన్‌స్టా పోస్ట్​.. కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక..

Ustaad Bhagat Singh Ticket Prices | ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ టికెట్‌ రేట్లు పెంపు
Allu Sirish Marriage | ప్రేయ‌సితో ఏడ‌డుగులు వేసిన అల్లు శిరీష్‌.. సంద‌డి చేసిన మెగా ఫ్యామిలీ
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
Vijay Rashmika Wedding | పెళ్లి ఫొటోలు పంచుకున్న రష్మిక
Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు
TAGGED:Dear Comrade starsGeetha Govindam pairHyderabad ReceptionIndian celebrity newsRashmika Mandanna marriageTollywood celebrity weddingUdaipur palace weddingVijay Deverakonda wedding
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article T20 World Cup 2026 T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ 2026పై యుద్ధ ప్రభావం.. జట్ల భద్రతపై ఐసీసీ అప్రమత్తం
Next Article RSS Nitya Shakha | RSS Nitya Shakha | ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం ‘నిత్యశాఖ’
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?