అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijay Rashmika Wedding | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Vijay Rashmika Wedding) మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తక్కువ మంది అతిథుల మధ్య వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఉదయం 10:10 గంటలకు వీరి పెళ్లి జరిగినట్లు తెలిసింది.
Vijay Rashmika Wedding | టాలీవుడ్ జంట
టాలీవుడ్ జంట మ్యారేజీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్నో రోజులుగా ప్రేమ పక్షులుగా విహరిస్తున్న ఈ జంట తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటైంది. హైదరాబాద్‌లో మార్చి 4న వీరి రిసెప్షన్ ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Vijay Rashmika Wedding | రెండు సంప్రదాయాల్లో..

విజయ్ దేవరకొండ–రష్మిక మందన్నాల వివాహం రెండు సంప్రదాయాల్లో జరిగినట్లు తెలిసింది. ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగ్గా.. సాయంత్రం కొడవ సంప్రదాయంలో నిర్వహించారు. తక్కువ మంది అతిథులను మాత్రమే వివాహ వేడుకకు ఆహ్వానించారు. పెళ్లి సందర్భంగా ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చారు. అతిథులందరికీ ‘నో మొబైల్’ పాలసీ అమలు చేశారు. దీంతో పెళ్లికి సంబంధించిన చిత్రాలు సాయంత్రం వరకు కూడా బయటకు రాలేదు. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
హైదరాబాద్‌లో రిసెప్షన్
పెళ్లికి తక్కువ సంఖ్యలో అతిథులను ఆహ్వానించిన ఈ జంట.. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేసుకోనుంది. మార్చి 4న జరిగే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి రానున్నారు.
One day, I missed her.
Missed her in a way that made me feel like my day would’ve been better if she were around.
Like my meals would’ve felt more wholesome if she were sitting across from me.
Like my workouts would’ve been more fun and less of a punishment if she were doing… pic.twitter.com/fy7umfHWjN
— Vijay Deverakonda (@TheDeverakonda) February 26, 2026

