అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Trisha Together | తాజాగా జరిగిన ఓ శుభకార్యంలో తమిళ నటుడు – టీవీకే అధినేత విజయ్, ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ కలిసి కనిపించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన వివాహ వేడుకకు వీరిద్దరూ కలిసే వచ్చారు.
Vijay Trisha Together | సంప్రదాయ దుస్తుల్లో జంటగా..
ఒకే కారులో చేరుకున్నటీవీకే అధినేత విజయ్–త్రిష మండపం లోపలికి సైతం కలిసి నడుచుకుంటూ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఇరువురి ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. వీరి ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులు పంచుకుంటూ పర్‌ఫెక్ట్ జంట అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Vijay Trisha Together | వార్తల్లో వ్యక్తిగత జీవితం
వీరిద్దరి స్నేహం గురించి ఇప్పటికే చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది. గతంలోనూ పలు సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపించినా.. అంతగా ఆకర్షించలేదు. కానీ, తాజాగా ఒకే కార్యక్రమానికి కలిసి రావడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.

