అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vikarabad Woman Constable Suicide | వికారాబాద్ జిల్లా (Vikarabad District)లో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని గంగారం సాయిబాబా కాలనీలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది.
Vikarabad Woman Constable Suicide | ఉరేసుకుని బలవన్మరణం
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్‌లో పట్టణంలోని టౌన్ గంగారం సాయి బాబా కాలనీ (Gangaram Sai Baba Colony)లో మహిళా కానిస్టేబుల్ దివ్య (28) నివాసం ఉంటోంది. కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా.. దారూర్ సీఐ కార్యాలయానికి (Darur CI Office) అటాచ్‌గా పనిచేస్తోంది. కాగా.. శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Vikarabad Woman Constable Suicide | కేసు నమోదు
మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య బల్మవనర్మణానికి పాల్పడగా.. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ సూసైడ్‌కు కుటుంబ కలహాలు కారణమా.. లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Excise Constable Transfers | త్వరలో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీలు : మంత్రి జూపల్లి

