అక్షరటుడే, కామారెడ్డి: Viksit Bharat Youth Parliament | యువతనే దేశానికి అమూల్యమైన సంపద అని (kamareddy district news) జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధు మోహన్ అన్నారు. పట్టణంలోని ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో (rk degree college kamareddy) గురువారం వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 (youth parliament competition) కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు.
Viksit Bharat Youth Parliament | యువత నిర్మాణాత్మక మార్గం వైపు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. యువత నిర్మాణాత్మక మార్గం వైపు (youth leadership india) వెళ్లాలని సూచించారు. దేశానికి (developed india program) మనం ఏం ఇవ్వగలమని ఆలోచించాలన్నారు. ప్రతి ఒక్కరిలో పోటీతత్వం ఉండాలని, అప్పుడే ఎంచుకున్న లక్ష్యాన్ని సాధిస్తామన్నారు.
అనంతరం ఉత్తమంగా మాట్లాడిన ఐదుగురు విద్యార్థులను (telangana education news) రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. వారిలో వరుసగా యాస్మిన్ సుల్తానా, సుదీక్షా రెడ్డి, అంజలి, సుధాంశ్, హర్షిణి ఉన్నారు. ఎంపికైన వారిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, ఆర్కే కళాశాలల సీఈవో జైపాల్ రెడ్డి, డీవైవో శైలి బెల్లాల్, సౌత్ క్యాంపస్ ప్రొఫెసర్ అంజయ్య, తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రొఫెసర్ అపర్ణ, జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Indiramma Houses Scheme | పథకాలను పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

