అక్షరటుడే, ఎల్లారెడ్డి/గాంధారి: Village development cooperation | పరస్పర సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి(Village developmen) చెందుతాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ (SC ST Commission) ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. పిట్లం మండలం బుర్నాపూర్, గాంధారి మండలం గండిపేట్ గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు.
Village development cooperation | బుర్నాపూర్ మార్కెట్‌యార్డు..
సందర్భంగా పిట్లం మండలం బుర్నాపూర్(Burnapur village) మార్కెట్ యార్డ్‌కు చేరుకున్న సందర్భంగా బక్కి వెంకటయ్యను అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ(Banswada) సబ్ కలెక్టర్ కిరణ్మయి(Sub-Collector Kiranmayi), సంబంధిత అధికారులు స్వాగతం పలికారు. అనంతరం బుర్నాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రజలతో సమావేశమై వారి సమస్యలు, అభ్యర్థనలు సంక్షేమ కార్యక్రమాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను నేరుగా ఛైర్మన్‌కు వివరించగా, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా బుర్నాపూర్ గ్రామపెద్దలతో మార్చి 9వ తేదీన ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశామన్నారు.
Village development cooperation | గాంధారి మండలం గండిపేట్‌లో..
గండిపేట్ గ్రామం(Gandipet village,) సమగ్రాభివృద్ధి (Rural governance India) దిశగా సర్పంచ్, ఉపసర్పంచ్ సమన్వయంతో కలసికట్టుగా పనిచేయాలని బక్కి వెంకటయ్య సూచించారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలంటే పరస్పర సహకారం, సమన్వయం పాటించడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీటి సదుపాయం, రహదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సర్పంచ్, ఉప సర్పంచ్‌లు ఐక్యంగా పని చేసి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం ఏ విధంగా కుర్చీలు ఉండాలో డిసైడ్ చేశారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టి గండిపేట్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


