అక్షరటుడే,పెద్ద కొడప్గల్: Village Development Goal | గ్రామాలను అభివృద్దే చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దకొడప్గల్ (Peddakodapgal) మండలంలోని తలబ్తండా సర్పంచ్ జాదవ్ సుమిత్ర బాయి అన్నారు. మండలంలోని తలబ్ తండాలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.
Village Development Goal | తండాలు బాగుపడ్డప్పుడే..
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాలు, తండాలు బాగుపడినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ప్రతిగ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఆయనలో ఉందన్నారు. ప్రజాపాలన -ప్రగతి నివేదన భాగంలో తమ ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని.. ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని సభలో పేర్కొన్నారు.
Village Development Goal | పథకాల అమలుపై శ్రద్ధ..
అంతేకాకుండా తండాలో ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses), రైతు భరోసా (Rythu Bharosa), ఉచిత కరెంట్, రుణమాఫీ ఇచ్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డిదేనని ఆమె అన్నారు. 99రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామాల్లోపలు అభివృద్ధి కార్యక్రమలు చేపడతామని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నీటి సమస్యను పరిష్కరించి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా తండాలో జరిగే శుభకార్యాల్లో ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించరాదని వాటితో అనారోగ్యాల పాలవుతారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, సర్పంచ్, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Hut Fire Damage | గుడిసె దగ్ధంతో తీవ్ర నష్టం.. గండివేట్లో ఘటన
