Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Virat Kohli innings | దుమ్మురేపిన ఆర్సీబీ .. కోహ్లీ సునామీ ఇన్నింగ్స్‌తో 202 టార్గెట్ సునాయాసంగా ఛేజ్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Virat Kohli innings | దుమ్మురేపిన ఆర్సీబీ .. కోహ్లీ సునామీ ఇన్నింగ్స్‌తో 202 టార్గెట్ సునాయాసంగా ఛేజ్

క్రీడలు

Virat Kohli innings | దుమ్మురేపిన ఆర్సీబీ .. కోహ్లీ సునామీ ఇన్నింగ్స్‌తో 202 టార్గెట్ సునాయాసంగా ఛేజ్

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదిరిపోయే ప్రదర్శనతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అజేయ అర్ధశతకంతో జట్టును సునాయాసంగా గెలిపించాడు.

Srinivas kolluri
Last updated: మార్చి 29, 2026 10:25 ఉద.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Virat Kohli innings

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Virat Kohli innings | ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ఆటతో ప్రత్యర్థి సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు కేవలం 15.4 ఓవర్లలోనే చేధించడం మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది.

Contents
  • Virat Kohli innings | కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్..
    • Virat Kohli innings | నిరాశ పరిచిన బౌలింగ్​

మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, అనికేత్ వర్మ 18 బంతుల్లో 43 పరుగులతో మెరిపించాడు. అలాగే హైన్రిచ్ క్లాసెన్ 31 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. అయితే టాప్ ఆర్డర్ విఫలం కావడంతో భారీ స్కోర్ ఉన్నప్పటికీ జట్టు ఒత్తిడిలో పడింది. ఆర్సీబీ తరఫున డఫీ, షెఫర్డ్‌లు తలో మూడు వికెట్లు తీసి రైజర్స్‌ను కట్టడి చేశారు.

Virat Kohli innings | కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్..

ఛేదనలో బెంగళూరు (RCB) జట్టు ఎక్కడా తడబడలేదు. ఓపెనర్ సాల్ట్ త్వరగా ఔటైనా, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ జోడీ మ్యాచ్‌ను పూర్తిగా తమ వైపు తిప్పుకుంది. దేవ్‌దత్ 26 బంతుల్లో 61 పరుగులతో వేగంగా ఆడగా, కోహ్లీ 38 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ క్లాసిక్ స్ట్రోక్స్‌తో పాటు భారీ సిక్సర్లతో అభిమానులను అలరించాడు. చివర్లో వరుసగా 6,4,4,4 బాదుతూ మ్యాచ్‌ను 16వ ఓవర్‌లోనే ముగించడం అతని క్లాస్‌కు నిదర్శనం. కెప్టెన్ రజత్ పటీదార్ కూడా 12 బంతుల్లో 31 పరుగులతో వేగంగా ఆడాడు. ఇక ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ను ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆదుకున్నాడు. క్లాసెన్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును 200 పరుగుల దాటించాడు. చివర్లో అనికేత్ వర్మ వేగంగా ఆడటం కూడా స్కోర్ పెరగడానికి కారణమైంది.

Virat Kohli innings | నిరాశ పరిచిన బౌలింగ్​

బౌలింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా నిరాశపరిచింది. ముఖ్యంగా కీలక సమయంలో క్యాచ్‌లు మిస్ అవడం, లైన్ అండ్ లెంగ్త్ లోపించడం వల్ల మ్యాచ్ చేతులారా జారిపోయింది. మొత్తానికి, ఐపీఎల్ కొత్త సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయంతో ఆరంభించగా, విరాట్ కోహ్లీ ఫామ్ మరోసారి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా డఫీ Duffy నిలవడం విశేషం.

ఇది కూడా చదవండి : Jasprit Bumrah Injury | ఐపీఎల్ 2026కు ముందు ముంబై ఇండియన్స్‌కు బిగ్‌ షాక్.. గాయంతో ఐపీఎల్ నుంచి బుమ్రా ఔట్..?

India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..
T20 World Cup 2026 Semifinal Rain | సెమీఫైనల్స్‌కి వర్షం ముప్పు ఉందా.. మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కి ఎవరు?
India vs England Semi | ఉత్కంఠభరిత పోరులో భారత్​ విజయం.. చివరి వరకు పోరాడి ఓడిన ఇంగ్లండ్​.. 8న న్యూజిలాండ్​తో తుదిపోరు!
India Semi final Chances | జింబాబ్వే చిత్తుగా ఓడ‌డంతో ప్రమాదంలో టీమిండియా.. భారత్ సెమీస్ ఆశలు క్లిష్టం.. NRR కీలకం
Sanju Samson 97 | సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌పై థ్రిల్లింగ్ విజయం
TAGGED:Devdutt PadikkalIPL 2026ishan kishanKohli battingRCB chase 202RCB vs SRHVirat Kohli
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article March 29 Gold Rates March 29 Gold Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు .. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ఎలా ఉన్నాయంటే..!
Next Article Dhurandhar 2 collections Dhurandhar 2 collections | ‘ధురంధర్: ది రివెంజ్’ సంచలనం.. ‘బాహుబలి 2’ రికార్డ్ బ్రేక్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?