అక్షరటుడే, వెబ్డెస్క్ : bribery case | వార్డు విద్యా, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శిని ఏసీబీ (ACB) అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడు ఆస్తి మ్యుటేషన్ దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు రూ.80 వేల లంచం డిమాండ్ చేశాడు. ఈ ఘటన విశాఖపట్నం (Visakhapatnam)లో చోటు చేసుకుంది.
వార్డు కార్యదర్శి పైల రాజేష్ అక్కయ్యపాలెంలోని లలిత నగర్ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నాడు. ఓ వ్యక్తి తన ఆస్తి మ్యూటేషన్ (Property Mutation) కోసం ఆయనకు దరఖాస్తు చేసుకున్నాడు. దానిని ప్రాసెస్ చేయడానికి సదరు అధికారి రూ.90 వేల లంచం అడిగాడు. బతిమిలాడటంతో ఆ మొత్తాన్ని రూ.80 వేలకు తగ్గించాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బాధితుడి నుంచి రూ.80 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.
bribery case | నిందితుడి ఇంట్లో సోదాలు
నిందితుడు తన కార్యాలయ ప్రాంగణంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం రాజేష్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేశారు. కాగా రాజేష్ 2019లో వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ కార్యదర్శిగా నియమితులయ్యాడు. గతంలో సీతమ్మధార వార్డు సచివాలయంలో పనిచేశాడు.
దీనిని కూడా చదవండి : East Godavari accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

