Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Visakhapatnam Firecracker Explosion | విశాఖలో భారీ పేలుడు.. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలి ఇళ్లు ధ్వంసం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Visakhapatnam Firecracker Explosion | విశాఖలో భారీ పేలుడు.. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలి ఇళ్లు ధ్వంసం

ఆంధ్రప్రదేశ్​తాజా వార్తలు

Visakhapatnam Firecracker Explosion | విశాఖలో భారీ పేలుడు.. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలి ఇళ్లు ధ్వంసం

విశాఖపట్నంలో గోపాలపట్నం పరిధిలోని మహాత్మా ఆదర్శనగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా సామగ్రి పేలడంతో భారీ ప్రమాదం జరిగింది.

Srinivas kolluri
Last updated: మార్చి 16, 2026 9:17 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Visakhapatnam Firecracker Explosion

అక్షరటుడే, వెబ్​డెస్క్: Visakhapatnam Firecracker Explosion | విశాఖపట్నం నగరంలో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించి స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. గోపాలపట్నం పరిధిలోని మహాత్మా ఆదర్శనగర్ (Mahatma Adarshnagar) ప్రాంతంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా సామగ్రి ఒక్కసారిగా పేలిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది.

Contents
  •  Visakhapatnam Firecracker Explosion | ఓ ఇంటిని అద్దెకు తీసుకుని
    • Visakhapatnam Firecracker Explosion | అక్ర‌మంగా త‌యారీ..
      • Visakhapatnam Firecracker Explosion | పోలీసు కేసు నమోదు

 Visakhapatnam Firecracker Explosion | ఓ ఇంటిని అద్దెకు తీసుకుని

ఈ పేలుడు శబ్దం సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు వినిపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికంగా ‘బాంబుల శివ’గా పిలిచే డి. శివకృష్ణకుమార్ (40) అనే వ్యక్తి శ్మశానవాటిక సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో అక్రమంగా బాణసంచా తయారు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 18న జరగనున్న ఉత్సవాల కోసం అతడు పెద్దఎత్తున బాణసంచా సామగ్రి, మందుగుండు పదార్థాలను అక్కడ నిల్వ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

Visakhapatnam Firecracker Explosion | అక్ర‌మంగా త‌యారీ..

ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఆ ఇంటి నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. కొద్దిసేపటికే భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ప్రభావంతో ఇంటి గోడలు కూలిపోయి సమీపంలోని రేకుల షెడ్లపై పడ్డాయి. చుట్టుపక్కల ఉన్న ఇళ్ల గోడలకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. పేలుడు తీవ్రత కారణంగా ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అలాగే ఇంట్లో ఉన్న ఇతర వస్తువులు కూడా నాశనమయ్యాయి. శ్లాబ్ పెచ్చులు పక్కింటిపై పడటంతో ఓ మహిళ స్వల్పంగా గాయపడింది. ఆమెను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న మర్రిపాలెం (Marripalem) అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడు శివ అక్కడి నుంచి పరారయ్యాడు.

Visakhapatnam Firecracker Explosion

Visakhapatnam Firecracker Explosion | పోలీసు కేసు నమోదు

ఈ ఘటనపై గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు (CI Sanyasi Naidu) ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా బాణసంచా తయారీ, నిల్వ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నివాస ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ బాణసంచా తయారీ కేంద్రాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అధికారులు ఇటువంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!

Gas Price Impact | గ్యాస్​ కొరత బూచీ.. ధరలు పెంచేస్తున్న హోటల్​, హాస్టల్​ నిర్వాహకులు!
Indigo Emergency Landing | ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​
Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు
Crude Oil Prices | కలవరపెడుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు
March 23 Horoscope | ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు.. ఈ రాశుల వారికి సమాజంలో తిరుగులేని పాపులారిటీ!
TAGGED:CI Sanyasi NaiduMahatma AdarshnagarMarripalemVisakhapatnam Firecracker Explosion
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Raj Gopal Reddy Dinner | కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్! Raj Gopal Reddy Dinner | కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!
Next Article SCB Hospital Fire SCB Hospital Fire | కటక్ ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఐసీయూలోని 10 మంది రోగులు మృతి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?