అక్షరటుడే, వెబ్‌డెస్క్: Visakhapatnam Oil LPG Ships | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజవాయువు సరఫరాపై ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌లో కూడా ఇంధన కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, విశాఖపట్నం పోర్టు (Visakhapatnam Port)కు వరుసగా చేరుతున్న చమురు, LPG నౌకలు పరిస్థితిని కొంతవరకు చక్కదిద్దే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా 24 వేల మెట్రిక్ టన్నుల LPG గ్యాస్‌తో ‘BW బ్రీచ్’ అనే భారీ నౌక గురువారం విశాఖ తీరానికి చేరుకుంది. ఈ నౌకలోని గ్యాస్‌ను శుక్రవారం అన్‌లోడ్ చేయనున్నారు. మరోవైపు నెదర్లాండ్స్ నుంచి లోడింగ్ అయిన ‘హెల్లాస్ గ్లాడియేటర్’, అలాగే అమెరికా నుంచి బయల్దేరిన ‘జుపిటర్’ (Jupiter) నౌకలు మార్చి 30న విశాఖకు చేరుకునే అవకాశముంది.
Visakhapatnam Oil LPG Ships | కొంత మేరకు ఊరట..
ఇప్పటికే ఫిబ్రవరి చివరి వారంలో యూఏఈ, ఖతార్ దేశాల నుంచి వచ్చిన ‘లుపినస్’ (22 టీఎంసీ), ‘ఏఐ వుకిర్’ (26 టీఎంసీ) వంటి LPG నౌకలు విజయవంతంగా విశాఖకు చేరుకున్నాయి. ఈ వరుస సరఫరాలు దేశంలో గ్యాస్ కొరతను తగ్గించే దిశగా కీలకంగా మారుతున్నాయి.ఇక చమురు సరఫరా విషయానికొస్తే, హిందూస్థాన్ పెట్రోలియం (Hindustan petrolium) కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన ‘ఎంవీ సమర్ శృతి’ నౌక ప్రస్తుతం విశాఖ పోర్టులో యాంకరేజీలో ఉండి 65 వేల టన్నుల హైస్పీడ్ డీజిల్‌ను అన్‌లోడ్ చేస్తోంది.
Visakhapatnam Oil LPG Ships | భారీ జంబో నౌక..
మరో రెండు రోజుల్లో ‘ఎంవీ స్వర్ణ సింధు’ అనే క్రూడ్ ఆయిల్ నౌక కూడా విశాఖ చేరనుంది.అదే విధంగా రష్యా నుంచి 1,36,728 టన్నుల ముడి చమురుతో భారీ జంబో నౌక శుక్రవారం రానుంది. అలాగే ఏప్రిల్ 2, 5 తేదీల్లో ‘ఫౌండేయ’, ‘దేశ్ గౌరవ్’ వంటి నౌకలు కూడా భారత పోర్టులకు చేరుకోనున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 1 నుంచి 25 వరకు ఖతార్, యూఏఈ, రష్యా, భారత్‌లోని పలు పోర్టుల నుంచి దాదాపు 10 చమురు నౌకలు విశాఖకు చేరాయి.
Visakhapatnam Oil LPG Ships | అంతర్జాతీయ సంక్షోభాల మధ్య కూడా..
ఇక ఇతర పోర్టుల్లో (Ports)కూడా ఇంధన సరఫరా క్రమంగా కొనసాగుతోంది. కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టు కు 40 వేల టన్నుల LPGతో ‘అపోలో ఓషియన్’ నౌక చేరుకోగా, త్వరలో మరిన్ని చమురు నౌకలు అక్కడికి రానున్నాయి. అలాగే చెన్నై హార్బర్ కు రష్యా నుంచి లక్ష టన్నుల ముడి చమురుతో నౌక చేరగా, శనివారం మరో నౌక రానుంది. మొత్తంగా చూస్తే, అంతర్జాతీయ సంక్షోభాల మధ్య కూడా భారత్ తన ఇంధన అవసరాలను తీర్చుకునే దిశగా కీలక చర్యలు తీసుకుంటోంది. విశాఖ సహా ప్రధాన పోర్టులకు వరుసగా చేరుతున్న ఈ నౌకలు దేశంలో ఇంధన కొరత భయాలను కొంతవరకు తగ్గిస్తున్నాయి. అయితే గ్లోబల్ పరిస్థితులు ఎలా మారుతాయన్నదే భవిష్యత్ సరఫరాపై కీలకంగా మారనుంది.
ఇది కూడా చదవండి : Fuel Export Tax India | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై పన్ను

