Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: VIVO T5x 5G | భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో.. వీవో టీ5ఎక్స్ 5జీ విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - VIVO T5x 5G | భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో.. వీవో టీ5ఎక్స్ 5జీ విడుదల

బిజినెస్​

VIVO T5x 5G | భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో.. వీవో టీ5ఎక్స్ 5జీ విడుదల

వివో మిడ్ రేంజ్‌లో మరో 5జీ స్మార్ట్ ఫోన్ మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. సేల్ ఈనెల 24న ప్రారంభం కానుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 5:19 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
VIVO T5x 5G

అక్షరటుడే, వెబ్​డెస్క్: VIVO T5x 5G | చైనాకు (China) చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ (Smartphone)  తయారీ కంపెనీ అయిన వివో మరో మోడల్ ఫోన్‌ను తీసుకువచ్చింది. టీ5ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను మంగళవారం (మార్చి 17న) భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది.

Contents
  • VIVO T5x 5G | 6.76 ఇంచ్ డిస్‌ప్లే..
    • VIVO T5x 5G | టర్బో ఆక్టా కోర్ ప్రాసెసర్‌
    • VIVO T5x 5G | 50 మెగా పిక్సెల్ కెమెరా
      • VIVO T5x 5G | వేరియంట్స్..

ఫ్లిప్‌కార్ట్‌లో ఈనెల 24 మధ్యాహ్నం 12 గంటలనుంచి సేల్ అందుబాటులో ఉండనుంది. దీనిని గతేడాది విడుదలైన వీవో టీ4 ఎక్స్ కు అడ్వాన్స్డ్ వర్షన్‌గా తీసుకువచ్చారు. బాక్స్‌లో ఫోన్‌తోపాటు చార్జర్, యూఎస్‌బీ కేబుల్, ఫోన్ కేస్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

VIVO T5x 5G | 6.76 ఇంచ్ డిస్‌ప్లే..

డిస్‌ప్లే : 6.76 ఇంచ్ ఏపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1080 x 2344 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది.
ఐపీ68/ ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది.

VIVO T5x 5G | టర్బో ఆక్టా కోర్ ప్రాసెసర్‌

సాఫ్ట్‌వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో కూడిన ఈ ఫోన్.. ఫన్ టచ్ ఓఎస్ 15 ఆధారిత ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
10 లక్షల అంటుటు స్కోర్ ఉంది.

VIVO T5x 5G | 50 మెగా పిక్సెల్ కెమెరా

కెమెరా సెటప్ : వెనకవైపు 50 మెగా పిక్సెల్ సోనీ హెచ్ డీ ఏఐ పవర్డ్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ టెలీ ఫొటో లెన్స్ తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఇచ్చారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలతో 4కే వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

బ్యాటరీ సామర్థ్యం : 7200 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్.. 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. రివర్స్ చార్జింగ్ సౌలభ్యమూ ఉంది. బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే 40 గంటల వీడియో ప్లేబ్యాక్, 93 గంటలపాటు మ్యూజిక్ ప్లేబ్యాక్, 18 గంటలపాటు సోషల్ మీడియ స్క్రోలింగ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ ఆరేళ్లపాటు మన్నుతుందని పేర్కొంటోంది.

VIVO T5x 5G | వేరియంట్స్..

సైబర్ గ్రీన్, స్టార్ సిల్వర్ కలర్స్‌లో మూడు వేరియంట్‌లలో తీసుకువచ్చారు.
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999.
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999.
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999.

కార్డ్ ఆఫర్స్ : ఫ్లిప్‌కార్డ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం వరకు క్యాష్ బ్యాక్‌తోపాటు రూ. 1,500 తక్షణ డిస్కౌంట్ లభించనుంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ మార్చి 24 సాయంత్రం 6.29 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

ఇది కూడా చదవండి..: Lava Bold 2 5G | పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో బడ్జెట్ ధరలో ఫోన్

iQOO Z11x 5G | ఐక్యూ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?
Gold Prices Fall | పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు బంగారం ధరల్లో తగ్గుద‌ల‌
March 27 Gold Rates | మళ్లీ ప‌రుగులు పెడుతున్న‌ బంగారం, వెండి ధరలు.. మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళ‌న‌!
TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ
Gold Rates March 20 | గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర!
TAGGED:5G smartphone India7200mAh battery phoneDimensity 7400 processorFlipkart smartphone saleVivo mobile specsVivo smartphone launchVivo T5X 5GVivo T5X price India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article GVCC Cricket Championship GVCC Cricket Championship | 3వ జీవీసీసీ క్రికెట్ ఛాంపియన్‌షిప్.. ఆర్కిటెక్ట్‌లు డిజైనర్ల కలయిక
Next Article SRH New Captain SRH New Captain | ఐపీఎల్ 2026లో SRHకి కొత్త కెప్టెన్.. అభిషేక్ శర్మ లేదా ఇషాన్ కిష‌న్‌ల‌లో ఒక‌రిని ఎంపిక చేసే ఛాన్స్..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?