అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vivo V70 FE 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ (Smartphone) బ్రాండ్ అయిన వీవో మరో మోడల్ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. 200 ఎంపీ కెమెరా, భారీ బ్యాటరీ, అధునాతన ఫీచర్లతో వీవో వీ70ఎఫ్ ఈ మోడల్‌ను తీసుకువచ్చారు. గురువారం మధ్యాహ్నం విడుదలైన ఈ ఫోన్ అమ్మకాలు ఈనెల 9 న ప్రారంభం కానున్నాయి. అమెజాన్ (Amazon)తో పాటు కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
Vivo V70 FE 5G | డిస్‌ప్లే..
6.83 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1260 x 2800 పిక్సల్స్ రిజల్యూషన్ ను సపోర్ట్ చేస్తుంది. ఐపీ68 / ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ సర్టిఫికెట్ ఉంది.
ప్రాసెసర్..
మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత అరిజిన్ ఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
Vivo V70 FE 5G | కెమెరా సెటప్..
వెనకవైపు 200 మెగా పిక్సెల్ ఓఐఎస్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ సామర్థ్యం..
7000 ఎంఏహెచ్ బ్యాటరీ బిగించారు. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 60 నిమిషాలలో ఒక శాతం నుంచి వంద శాతం వరకు ఫాస్ట్‌గా చార్జింగ్ అవుతుంది. ఒకసారి ఫుల్ చార్జి చేస్తే 43.8 గంటలపాటు యూట్యూబ్ ప్లేబ్యాక్ సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్స్..
నార్తర్న్ లైట్స్ పర్పుల్, మాన్సూన్ బ్లూ కలర్స్‌లో మూడు వేరియంట్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999.
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,999.
12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 44,999.
కార్డ్ ఆఫర్స్..
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే 10 శాతం వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఇది కూడా చదవండి..: India Car Sales Growth | కార్లకు పెరిగిన డిమాండ్.. అరకోటికి చేరువైన అమ్మకాలు
