అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Warangal crime case | వరంగల్ (Warangal) జిల్లాలో విషాదం చోటు చోటు చేసుకుంది. ఓ తండాకు చెందిన యువతిపై నలుగురు యువకులు గ్యాంగ్‌రేప్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో యువతి మృతి చెందింది.
Warangal crime case | బాధితుల ధర్నా
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నలుగురు యువకులు యువతిపై అత్యాచారం చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావం అయి ఆమె చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి : Sathankulam Custodial Death Case | లాకప్‌డెత్ కేసులో సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
