అక్షరటుడే, ఎల్లారెడ్డి: Water Tank Inspection | జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో అధికారులు నిత్యం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సదాశివనగర్ మండలం (Sadashivanagar Mandal)లో కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.
Water Tank Inspection | స్వయంగా వాటర్ ట్యాంక్ ఎక్కి..
మండలంలోని ఒకటవ వార్డులో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమానికి కలెక్టర్ (Collector Ashish Sangwan) హాజరై పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వయంగా ఆయన వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారు. ట్యాంకులో కార్మికులు ఎల్లగారి బుచ్చయ్య, ప్రవీణ్ కార్మికులు నిర్వహిస్తున్న పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎప్పటికప్పుడు ట్యాంక్‌లను శుభ్రం చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Water Tank Inspection | సమర్థవంతంగా నిర్వహించిన వారికి సన్మానం..
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కార్మికులు విధులను సక్రమంగా నిర్వహిస్తే వారిని సన్మానించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ మేరకు పలువురిని సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సీఈవో చందర్ ప్రత్యేక అధికారి సతీష్, డీఎల్పీవో శ్రీనివాస్, పంచాయతీ శాఖ అధికారులు (Panchayat Department Officers) , స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
వ్యవసాయ క్షేత్రంలో..
మండలంలోని వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంటల్లో నానో యూరియాను డ్రోన్ సాయంతో పిచికారీ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు వేయవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు పంటల దిగుబడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించి డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు నానో యూరియా ప్రయోజనాలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం గురించి వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, సిబ్బంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు రేపల్లెవాడ గ్రామపంచాయతీ పరిధిలో మహిళల కోసం మహిళా భవనాన్ని ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Fake Number Plate | చలాన్ల నుంచి తప్పించుకునే యత్నం.. తప్పుడు నంబర్ ప్లేట్‌తో తిరుగుతున్న డీసీఎం పట్టివేత

