అక్షరటుడే, వెబ్డెస్క్ : Water wars warning | ప్రపంచంలో ప్రస్తుతం ఆయిల్ కోసం యుద్ధాలు జరుగుతున్నాయని హైడ్రా (Hydraa) కమిషనర్ రంగనాథ్ అన్నారు. నీటి కోసం యుద్ధాలు జరగకుందే ప్రతి ఒక్కరు మేల్కొనాలని కోరారు. జేఎన్‌టీయూ (JNTU)లో సోమవారం నిర్వహించిన వరల్డ్ వాటర్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ (Hyderabad) నగర జనాభా విపరీతంగా పెరుగుతోందని హైడ్రా కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం 1.60 కోట్లున్న నగర జనాభా 2050 నాటికి 3 కోట్లు దాటే అవకాశం ఉందన్నారు. జనాభా అవసరాలమేరకు నగరాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో నగరంలోని గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించిందన్నారు. ఆ దిశగా హైడ్రా చర్యలు చేపట్టిందని వివరించారు. మొదటి దశలో 6 చెరువుల పనులు చేపట్టామన్నారు. ఇందులో మూడు ప్రారంభం అవ్వగా.. మరో 3 చెరువులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రెండోదశలో మరో 18 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు.
Water wars warning | కబ్జాలకు చెక్
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డేటా ప్రకారం 1975 నుంచి 2023 లోపు నగరంలో 61 శాతం చెరువులు మాయం అయ్యాయని రంగనాథ్ తెలిపారు. 1300 చెరువుల్లో 700 చెరువులు మాయం అవ్వగా.. ఉన్న చెరువులు 60 శాతం కబ్జాకు గరయ్యాయని తెలిపారు. చెరువుల ఆక్రమణలకు హైడ్రా చెక్ పెట్టిందన్నారు. హైడ్రా చర్యలతో ఇప్పడు రియల్టర్లు చెరువుల ఎప్‌టీఎల్, బఫర్ పరిధిలో ఇళ్లు నిర్మించడంలేదన్నారు. ప్రజలు కొనడానికి కూడా ముందుకు రావడంలేదని చెప్పారు.
Water wars warning | చెరువులు రక్షించుకోవాలి
భవిష్యత్ తరాల అవసరాలమేరకు చెరువులు, నాలాలను రక్షించాలని రంగనాథ్ సూచించారు. పర్యావరణహితమైన నగర నిర్మాణమే లక్ష్యంగా హైడ్రా పని చేస్తోందని వెల్లడించారు. బడాబాబుల ఆక్రమణలు తొలగించి 1350 ఎకరాల ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన భూములను కాపాడామని చెప్పారు.
దీనిని కూడా చదవండి : QNet MLM scam | క్యూనెట్ ఎంఎల్ఎం స్కామ్‌లో 32 మంది అరెస్ట్ : సీపీ సజ్జనార్

