అక్షరటుడే, వెబ్‌డెస్క్: Watermelon Health Benefits | ఎండలు ముదురుతుంటే చాలు, దాహం వేస్తే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పుచ్చకాయ. దాదాపు 92 శాతం నీటిని కలిగి ఉండి, శరీరాన్ని చల్లబరిచే ఈ పండు వేసవిలో మనకు ప్రకృతి ఇచ్చిన వరం. అయితే, పుచ్చకాయ రుచికరమే కాదు, ఎన్నో పోషకాలకు నిలయం కూడా. కానీ దీనిని ఏ సమయంలో, ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలియకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Watermelon Health Benefits | ఆరోగ్య ప్రయోజనాలు:
శరీరానికి హైడ్రేషన్: ఇందులో అధిక నీటి శాతం ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
గుండె ఆరోగ్యం: ఇందులోని సిట్రులిన్ అనే యాసిడ్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
జీర్ణక్రియకు మేలు: పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది, మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
చర్మ సౌందర్యం: విటమిన్ ఎ, సి, ఇ, అధిక నీటి శాతం చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
వ్యాధి నిరోధక శక్తి: ఇందులోని విటమిన్లు శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించి, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.
కిడ్నీల శుద్ధి: మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడమే కాకుండా, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో పుచ్చకాయ సహకరిస్తుంది.
Watermelon Health Benefits | ఎవరు, ఎలా తీసుకోకూడదు?
పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా, అందరికీ అన్ని వేళలా సరిపడకపోవచ్చు.
పరిమాణం ముఖ్యం: రోజుకు 500 గ్రాములకు మించి తింటే కడుపులో గ్యాస్, విరోచనాలు అయ్యే ఛాన్స్ ఉంది.
సమయపాలన: రాత్రిపూట పుచ్చకాయ తినడం అంత మంచిది కాదు. పగటిపూట తీసుకోవడమే ఉత్తమం.
నీళ్ల జోలికి వెళ్లొద్దు: పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.
డయాబెటిస్ బాధితులు: ఇందులో సహజ చక్కెరలు ఉంటాయి కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి.
మద్యపాన అలవాటు: ఆల్కహాల్ తీసుకునే వారు దీనికి దూరంగా ఉండటం మంచిది, లేదంటే ఇది కాలేయ సమస్యలకు దారితీయవచ్చు.
ఇది కూడా చదవండి: Rajma Health Benefits | మాంసాహారానికి ప్రత్యామ్నాయం.. ప్రొటీన్‌కు రారాజు రాజ్మా

