అక్షరటుడే, ఎల్లారెడ్డి: Welfare Schemes Distribution | అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు(Welfare schemes) అందేలా చూడాలని ఎల్లారెడ్డి మున్సిపల్(Yellareddy Municipality) ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, కమిషనర్ మహేష్ అన్నారు. పట్టణంలోని (Yellareddy News) రెండో వార్డు బీసీ కాలనీలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో (Praja Palana) భాగంగా గురువారం వార్డు సభ నిర్వహించారు.
Welfare Schemes Distribution | ప్రజల కోసం ఎన్నో పథకాలు..
వార్డుసభలో ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, (Telangana government) రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్న రకం వడ్లకు బోనస్, పెన్షన్లు, గృహజ్యోతి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డులు తదితర పథకాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే స్థానిక వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని లోతట్టు(public welfare) ప్రాంతమైన బీసీ కాలనీలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కాలనీ వాసులతో చర్చించారు.
Welfare Schemes Distribution | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, కమిషనర్ మహేష్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని, రాబోయే కాలంలో ఆరోగ్యం, పరిశుభ్రత, విద్య, ఉపాధి అవకాశాలు, క్రీడల ప్రోత్సాహం, మహిళా, శిశు సంక్షేమం, (pensions scheme) పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మంచిర్యాల మహేశ్వరి విద్యాసాగర్, ఎంఈవో, వార్డు ఆఫీసర్ అవినాష్, విద్యుత్ ఏఈ, లైన్మన్, ఆర్పీ రేఖ, అంగన్వాడీ టీచర్ ముస్రత్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: World Autism Day | ఆటిజంను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం: ఐఎంఏ అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్ విశాల్
