Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: West Indies Team Travel | యుద్ధం వ‌ల‌న‌ భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్ జట్టుకి గుడ్ న్యూస్.. తొమ్మిది రోజుల తర్వాత స్వదేశానికి ప్రయాణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - West Indies Team Travel | యుద్ధం వ‌ల‌న‌ భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్ జట్టుకి గుడ్ న్యూస్.. తొమ్మిది రోజుల తర్వాత స్వదేశానికి ప్రయాణం

క్రీడలు

West Indies Team Travel | యుద్ధం వ‌ల‌న‌ భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్ జట్టుకి గుడ్ న్యూస్.. తొమ్మిది రోజుల తర్వాత స్వదేశానికి ప్రయాణం

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత్‌లో చిక్కుకుపోయిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఎట్టకేలకు స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. దాదాపు తొమ్మిది రోజుల పాటు నిరీక్షించిన తర్వాత ఆటగాళ్లు, జట్టు సిబ్బంది కోసం వాణిజ్య విమానాల్లో టికెట్లు ఏర్పాటు చేసినట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 11:36 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
West Indies Team Travel

అక్షరటుడే, వెబ్​డెస్క్: West Indies Team Travel | పశ్చిమాసియా ప్రాంతంలో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ ప్రాంత గగనతలాన్ని పలు దేశాలు తాత్కాలికంగా మూసివేశాయి. ఈ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి (International Cricket Council) ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం భారత్‌కు చేరుకోవడం ఆలస్యమైంది. దీంతో ఆటగాళ్లు, సిబ్బంది తిరుగు ప్రయాణం అనిశ్చితిలో పడింది.

Contents
  • West Indies Team Travel | ఈ రోజే స్వ‌దేశాల‌కి..
    • West Indies Team Travel | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం

ఈ పరిస్థితిని గమనించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (West Indies Cricket Board) ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక విమానం కోసం మరింత కాలం వేచి ఉండటం సరైనది కాదని భావించి, అంతర్జాతీయ క్రికెట్ మండలితో చర్చలు జరిపింది. అనంతరం వాణిజ్య విమానాల్లో ఆటగాళ్లకు టికెట్లు ఏర్పాటు చేసి వారిని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేసింది.

West Indies Team Travel | ఈ రోజే స్వ‌దేశాల‌కి..

బోర్డు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లు మరియు జట్టు సిబ్బంది భారత్ నుంచి బయలుదేరారు. మిగిలిన వారు కూడా ఈరోజే తమ స్వదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇదే సమస్యను జింబాబ్వే క్రికెట్ జట్టు కూడా ఎదుర్కొంది. మార్చి 1న దక్షిణాఫ్రికాతో తమ చివరి మ్యాచ్ ఆడిన తర్వాత జింబాబ్వే (Zimbabmbwe) ఆటగాళ్లు కూడా భారత్‌లోనే ఉండిపోయారు. అంతర్జాతీయ విమాన మార్గాల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా వారి ప్రయాణం కూడా ఆలస్యమైంది.అయితే వారి కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా మీదుగా జింబాబ్వే జట్టును స్వదేశానికి పంపించినట్లు ఐసీసీ అధికారులు (ICC Officers) తెలిపారు.

West Indies Team Travel

West Indies Team Travel | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం

ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విమాన రాకపోకలపై పడుతోంది. ఈ కారణంగా పలు అంతర్జాతీయ విమాన మార్గాలు మార్చాల్సి వస్తోంది. అదే ప్రభావం టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)లో  పాల్గొన్న కొన్ని జట్ల ప్రయాణాలపై కూడా పడింది. అయితే ఇప్పుడు పరిస్థితులు కొంతవరకు సద్దుమణుగుతుండటంతో జట్లు తమ స్వదేశాలకు చేరుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి..: BCCI Reward India | టీమ్‌ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లో తెలుసా!

Finn Allen 33 Ball Century | ఈడెన్ గార్డెన్స్‌లో కివీస్ తుపాను ఇన్నింగ్స్.. మ‌ళ్లీ ‘ఛోకర్స్’గా సౌతాఫ్రికా
Chahal Fitness IPL 2026 | ఐపీఎల్ 2026 కోసం కొత్త నిర్ణయం తీసుకున్న చాహల్… ఆరు నెలలుగా మద్యానికి దూరం
IPL 2026 Injuries | ఐపీఎల్ 2026కి ముందు ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాక్.. స్టార్ పేసర్ల గాయాలతో జట్లకు భారీ దెబ్బ!
BCCI Contract Changes | బీసీసీఐ కాంట్రాక్ట్ మార్పులతో బుమ్రాకు షాక్?.. రూ.2 కోట్ల నష్టం అంటూ సోషల్ మీడియాలో చర్చ
SRH New Captain | ఐపీఎల్ 2026లో SRHకి కొత్త కెప్టెన్.. అభిషేక్ శర్మ లేదా ఇషాన్ కిష‌న్‌ల‌లో ఒక‌రిని ఎంపిక చేసే ఛాన్స్..
TAGGED:ICC OfficersInternational Cricket CouncilT20 World CupWest Indies Cricket BoardWest Indies Team TravelZimbabmbwe
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Speaker Decision Telangana Speaker Decision | స్పీకర్​ కీలక నిర్ణయం.. కడియం, దానం అనర్హత పిటిషన్ల కొట్టివేత
Next Article Stock Market 5 Indian Stock Market | ఫ్లాట్‌గా ప్రారంభమై.. నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?