Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: WhatsApp Username Feature | వాట్సాప్‌లో భారీ మార్పు.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేదు, యూజర్‌నేమ్‌తోనే చాటింగ్!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

టెక్నాలజీ - WhatsApp Username Feature | వాట్సాప్‌లో భారీ మార్పు.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేదు, యూజర్‌నేమ్‌తోనే చాటింగ్!

టెక్నాలజీ

WhatsApp Username Feature | వాట్సాప్‌లో భారీ మార్పు.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేదు, యూజర్‌నేమ్‌తోనే చాటింగ్!

వాట్సాప్ వినియోగదారుల కోసం కీలకమైన కొత్త ఫీచర్ సిద్ధమవుతోంది. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేకుండా యూజర్‌నేమ్ ఆధారంగా చాటింగ్, కాల్స్ చేయగలిగే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 21, 2026 4:30 సా.
Srinivas Kolluri
6 రోజులు ago
Share
WhatsApp Username Feature

అక్షరటుడే, వెబ్​డెస్క్ : WhatsApp Username Feature | ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు (WhatsApp Users) ఒక కీలక అప్డేట్ రానుంది. ఇప్పటి వరకు ఈ యాప్ పూర్తిగా మొబైల్ నంబర్లపై ఆధారపడి పనిచేస్తుండగా, ఇకపై యూజర్‌నేమ్ ఆధారంగా కమ్యూనికేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం పరీక్ష దశలో ఉండగా, త్వరలోనే సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Contents
  • WhatsApp Username Feature | సాధార‌ణ యూజ‌ర్స్‌కి కూడా..
    • WhatsApp Username Feature | ముఖ్య విషయం ఏమిటంటే..

ఈ కొత్త విధానం ద్వారా వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌ను ఇతరులతో షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ప్రైవసీ విషయంలో ఆందోళన చెందే వారికి ఇది పెద్ద ఉపశమనం కానుంది. ఇప్పటి వరకు తెలియని వ్యక్తులతో మాట్లాడాలంటే తప్పనిసరిగా నంబర్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ యూజర్‌నేమ్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, ఒక ప్రత్యేక పేరుతోనే చాట్ చేయడం, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేయడం సాధ్యమవుతుంది.

WhatsApp Username Feature | సాధార‌ణ యూజ‌ర్స్‌కి కూడా..

యూజర్‌నేమ్ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్‌గా ఉండనుంది. అంటే వినియోగదారుడు కోరుకుంటేనే దీనిని ఉపయోగించుకోవచ్చు. లేకపోతే పాత విధానంలోనే ఫోన్ నంబర్ ఆధారంగా యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ మొదట వ్యాపార ఖాతాలకు మాత్రమే వస్తుందని భావించినప్పటికీ, ఇప్పుడు సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. వ్యాపార ఖాతాల కోసం ప్రత్యేకంగా బిజినెస్-స్కోప్ యూజర్ ఐడీ అనే విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు. దీని ద్వారా కంపెనీలు తమ కస్టమర్లతో నేరుగా కనెక్ట్ అవ్వగలుగుతాయి. ఉదాహరణకు, ఒక బ్యాంక్ లేదా సర్వీస్ సంస్థకు ప్రత్యేక యూజర్‌నేమ్ ఉండి, వినియోగదారులు నంబర్ అవసరం లేకుండా నేరుగా వారిని సంప్రదించవచ్చు.

WhatsApp Username Feature | ముఖ్య విషయం ఏమిటంటే..

మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో విడుదలకు ముందే యూజర్‌నేమ్ రిజర్వ్ చేసుకునే అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది. అంటే వినియోగదారులు తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను (Username) ముందుగానే నమోదు చేసుకునే వీలుంటుంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ యూజర్‌నేమ్ ఫీచర్ 2026 జూన్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి..: ఏఐ కంప్యూట్ రంగంలో సంచలనం: ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ భారీ ఒప్పందం

IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
Realme Narzo Power 5G | భారీ బ్యాటరీతో రియల్‌మీ ‘పవర్’ విడుదల.. ప్రారంభ ఆఫర్‌లో రూ. 4 వేల వరకు తగ్గింపు
Nothing Phone 4A | కొత్త లుక్‌తో నథింగ్ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?
iQOO 15R Launch | ఐకూనుంచి మిడ్‌రేంజ్‌లో పవర్‌ఫుల్ ఫోన్..! ప్రీ బుకింగ్‌తో ఐకూ టీడబ్ల్యూఎస్ ఫ్రీ..
SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన!
TAGGED:digital privacymessaging apps updateprivacy feature whatsappsocial media appstech news 2026whatsapp new featuresWhatsApp Username FeatureWhatsApp Users
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Education Budget Telangana Education Budget | విద్యార్థులకు చదువులను దూరం చేసే బడ్జెట్ ఇది..
Next Article KTR Congress Guarantees KTR Congress Guarantees | గ్యారంటీల పేరుతో కాంగ్రెస్​ ఓట్లు కొట్టేసి.. 4 కోట్ల మందికి టోపీ పెట్టింది..: కేటీఆర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?