అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Wines Closed on Holi | మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. హోలీ పండుగ నేపథ్యంలో వైన్స్‌లను మూసి ఉంచనున్నట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.
Wines Closed on Holi | శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని..
శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని వైన్స్ షాపులు (Wine Shops) బంద్ ఉంచుతున్నట్లు సీపీ తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో సెక్షన్ 20(1) తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. కామదహనం, హోలీ పండుగ (Holi Festival) నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాలోని కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, ఐఎంఎల్ (ఏ4) షాప్‌లు, బార్లు, క్లబ్బులు ఈనెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసి ఉంటాయని సీపీ తెలిపారు.

Wines Closed on Holi | ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలి..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో హోలీ పండుగను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సీపీ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Naikpod Adhoc Committee | ఆదివాసీ నాయక్‌పోడ్ రాష్ట్ర అడ్‌హక్ కమిటీ ఏర్పాటు

