అక్షరటుడే, ఎల్లారెడ్డి: Women Federation Buildings | ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 114 గ్రామాలకు మహిళా సమాఖ భవనాలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రకటించారు. సుమారు రూ .1.40 కోట్ల నిధులతో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు.
Women Federation Buildings | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (Yellareddy Constituency) 114 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఒక్కో మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున, మొత్తం 114 భవనాలకు రూ.11.40 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
Women Federation Buildings | సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు..
గ్రామాల్లో మహిళా సంఘాలకు సమావేశాలు నిర్వహించుకునేందుకు ప్రత్యేక భవనాలు లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో వారు ఇటీవల ఈ విషయాన్ని మహిళా సంఘాల సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మహిళల సమస్యలను గమనించిన ఎమ్మెల్యే (MLA Madan Mohan) సంఘాలకు భవనాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చారు. కలెక్టర్, రూరల్ డెవలప్మెంట్ అధికారి, పంచాయతీ రాజ్ కమిషనర్, సంబంధిత శాఖ మంత్రులతో చర్చించి, గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

Women Federation Buildings | కొన్ని గ్రామాల్లో ప్రారంభం..
ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్ మోహన్ స్వయంగా పాల్గొని భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ భవనాలు నిర్మాణం పూర్తయిన తర్వాత మహిళా సంఘాల సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి శాశ్వత వేదిక అందుబాటులోకి రానుంది. ఈ విధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 114 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాలు మంజూరు కావడం మహిళల సాధికారతకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
ఇది కూడా చదవండి..: Brahmotsavam Festival Induru | బ్రహ్మోత్సవాల్లో దేవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయి..

