Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Women Health Tests | మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు : మంత్రి రాజనర్సింహ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Women Health Tests | మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు : మంత్రి రాజనర్సింహ

తెలంగాణ

Women Health Tests | మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు : మంత్రి రాజనర్సింహ

మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి దామోదర్​ రాజనర్సింహ అన్నారు. ఒక్కో మహిళకు 30 రకాల పరీక్షలు చేస్తామన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 4, 2026 9:01 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Women Health Tests

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Women Health Tests | రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాక సంఘాల మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్​ రాజనర్సింహ (Damodar Rajanarsimha) అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Women’s Day) సందర్భంగా ప్రారంభించాలని సూచించారు.

Contents
  • Women Health Tests | మహిళలకు రక్త పరీక్షలు
    • Women Health Tests | మూడు దశల్లో..

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై మంత్రి అధికారులతో సమీక్ష చేశారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకూ 99 రోజులపాటు చేపట్టనున్న కార్యక్రమాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. హాస్పిటళ్లలో రోజువారీ వైద్య సేవలకు ఆటంకం కలగకుండా యాక్షన్ ప్లాన్ ఉండాలన్నారు. అధికారులు రూపొందించిన ప్రణాళికను స్వల్ప మార్పులతో మంత్రి ఆమోదించారు. మొత్తం 4 దశల్లో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

Women Health Tests | మహిళలకు రక్త పరీక్షలు

తొలి దశలో మార్చి 6 నుంచి 31వ తేదీ వరకు మాతా శిశు సంరక్షణ, కౌమార దశ బాలికలు, వృద్ధుల ఆరోగ్య సేవలపై దృష్టి పెడతారు. హాస్పిటళ్లలో పారిశుధ్య నిర్వహణ, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, ఆస్తుల వెరిఫికేషన్ వంటి పరిపాలనా పరమైన అంశాలను చక్కదిద్దుతారు. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెల్ఫ్ హెల్ప్​ గ్రూపు మహిళల హెల్త్ ప్రొఫైల్ (Health Profile) తయారీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా ఒక్కో మహిళకు మొత్తం 30 రకాల పరీక్షలు చేయనున్నారు.

Women Health Tests | మూడు దశల్లో..

మార్చి 8 నుంచి మూడు దశల్లో సుమారు 46 లక్షల మంది మహిళలకు పరీక్షలు చేయనున్నారు. తొలి దశలో ప్రతి జిల్లా నుంచి 5 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రెండో దశలో మరో 10 మండలాల్లో, చివరి దశలో మిగిలిన అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. మొత్తం స్క్రీనింగ్‌ను 6 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

దీనిని కూడా చదవండి : Telangana Power Demand | రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్​ డిమాండ్​ : భట్టి విక్రమార్క

Telangana Power Demand | రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్​
Kukatpally ACB Trap | ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్
Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి
Telangana Budget Approval | తెలంగాణ బడ్జెట్​కు కేబినెట్​ ఆమోదం
Amrabad Rehabilitation Support | ‘అమ్రాబాద్’​ నిర్వాసితులకు అండగా ఉంటాం : భట్టి విక్రమార్క
TAGGED:Damodar RajanarsimhaInternational Women’s Day programMedical screening drivepublic health initiativeSHG women health checkupTelangana health programWomen health tests
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Fire Accident Alert Fire Accident | అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం : హైడ్రా కమిషనర్
Next Article Muscat Road Accident | మస్కట్‌లో రోడ్డు ప్రమాదం.. ఆలూర్ వాసి దుర్మరణం Muscat Road Accident | మస్కట్‌లో రోడ్డు ప్రమాదం.. ఆలూర్ వాసి దుర్మరణం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?