అక్షరటుడే, న్యూఢిల్లీ: Women Reservation Bill | భారత్ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల (ఏప్రిల్) 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
Women Reservation Bill | సుదీర్ఘ కాలంగా..
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మహిళా రిజర్వేషన్ బిల్లు సుదీర్ఘకాలంగా పెండింగులో ఉంది. లోక్‌సభతోపాటు రాష్ట్ర అసెంబ్లీల్లో అతివలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సమావేశాల ప్రాధాన్యం మరింత పెరిగింది.
Women Reservation Bill | మహిళా సాధికారతకు..
ఈ ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదం దిశగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళా సాధికారతకు ఇది చారిత్రాత్మక అడుగుగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఈ బిల్లుపై కొన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్‌లో ఉపవర్గాల అంశం, అమలు విధానం వంటి విషయాలపై చర్చలు జరిగే అవకాశముంది.
