అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Womens Health Awareness | మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మేయర్ ఉమారాణి(Mayor Umarani) అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Womens Day) నగరంలోని మెడికవర్ ఆస్పత్రిలో (Medicover Hospitals) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ మేయర్ ఉమారాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Womens Health Awareness | కుటుంబానికి ఆధారం మహిళలే..
మేయర్ ఉమారాణి మాట్లాడుతూ.. మహిళలు కుటుంబం, సమాజానికి బలమైన ఆధారమని పేర్కొన్నారు. కుటుంబ ఆరోగ్యం, (Health Awareness Program) పిల్లల భవిష్యత్తు, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఆమె అన్నారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Womens Health Awareness | సేవలను వినియోగించుకోవాలి..
ఆధునిక వైద్య సదుపాయాలతో (Telangana Health News) ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న మెడికవర్ ఆస్పత్రి (Medicover Hospitals) అందిస్తున్న సేవలను మహిళలు, ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు వైద్యులు మహిళలు ఎదుర్కొనే వివిధ ఆరోగ్య సమస్యలపై సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు మహిళ సిబ్బందిని సన్మానించారు. ఆస్పత్రి వైద్యులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ACB raids Tahsildar | తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూస్తే షాక్ అవాల్సిందే?

