Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Yamuna Boat Accident | యమునా నదిలో మునిగిన పడవ.. పలువురు జలసమాధి..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Yamuna Boat Accident | యమునా నదిలో మునిగిన పడవ.. పలువురు జలసమాధి..

జాతీయం

Yamuna Boat Accident | యమునా నదిలో మునిగిన పడవ.. పలువురు జలసమాధి..

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యమునా నదిలో భక్తులను తీసుకెళ్తున్న పడవ మునిగిపోయింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 10, 2026 5:25 సా.
Srinivas Kolluri
17 గంటలు ago
Share
Yamuna Boat Accident

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Yamuna Boat Accident | ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మథురలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యమునా నదిలో భక్తులను తీసుకెళ్తున్న పడవ మునిగిపోయింది. దీంతో పలువురు నీటిలో మునిగిపోయారు. కాగా.. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు సమాచారం.

Contents
  • Yamuna Boat Accident | భక్తులతో వెళ్తున్న పడవ..
    • Yamuna Boat Accident | రక్షణ చర్యలు చేపట్టిన బృందాలు
      • Yamuna Boat Accident | తొమ్మిది మంది మృతి

Yamuna Boat Accident | భక్తులతో వెళ్తున్న పడవ..

యమునా నది (Yamuna River)లో భక్తులను తీసుకెళ్తున్న పడవ అకస్మాత్తుగా మునిగిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో కేసీ ఘాట్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో రెండు పడవల్లో ఒకటి మునిగిపోయింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది భక్తులు నీట మునిగినట్లు తెలుస్తోంది.

జిల్లా మేజిస్ట్రేట్ సి.పి.సింగ్ మాట్లాడుతూ.. “యమునా నదిలో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనలో లుధియానా నుంచి వచ్చిన భక్తులు రెండు పడవల్లో ప్రయాణిస్తుండగా ఒకటి మునిగిపోయింది. ప్రస్తుతం ఆరు మృతదేహాలు బయటపడ్డాయి. 16 నుంచి 17 మందిని సజీవంగా రక్షించడం జరిగింది” అని తెలిపారు.

Yamuna Boat Accident | రక్షణ చర్యలు చేపట్టిన బృందాలు

ప్రమాదం విషయం తెలియగానే పోలీసు బృందాలు, డైవర్లు, రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు సుమారు 13 మందిని నది నుంచి బయటకు తీసినట్లు సమాచారం. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఐదుగురి పరిస్థితి స్వల్పంగా గాయపడ్డారు. వారందరినీ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. మరో 12 మంది కోసం గాలిస్తున్నారు.

Yamuna Boat Accident | తొమ్మిది మంది మృతి

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు సమాచారం. కాగా.. స్థానికులు ఆరుగురి మృతదేహాలు వెలికితీసినట్లుగా తెలుస్తోంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Mathura, Uttar Pradesh: A boat carrying devotees from Ludhiana capsized in the Yamuna River, resulting in a tragic incident. Six bodies have been recovered so far, while rescue operations continue

DM CP Singh says, “Today, a very unfortunate accident occurred at around 2:45 PM… pic.twitter.com/4nnITU4CgB

— IANS (@ians_india) April 10, 2026

ఇది కూడా చదవండి..: Amit Shah Manifesto | అక్రమ చొరబాట్లపై చర్యలు.. నిరుద్యోగులకు రూ.3 వేలు : అమిత్​ షా

Panneerselvam Joins DMK | డీఎంకేలో చేరిన పన్నీర్​ సెల్వం
Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
Vijay Assets Declaration | టీవీకే చీఫ్ విజయ్​​ ఆస్తులు రూ.603 కోట్లు
Bengal Elections | బెంగాల్​ మార్పు కోరుకుంటోంది : ప్రధాని మోదీ
Ayodhya Ram Mandir | అయోధ్యలో అద్భుతం.. బాలరాముడికి సూర్యతిలకం
TAGGED:boat tragedy Indiabreaking news Indiadevotees accidentMathura newsrescue operationsriver accidentUttar Pradeshuttar pradesh newsYamuna accidentYamuna Boat AccidentYamuna River
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Congress Leader Ramakrishna | Congress Leader Ramakrishna | కిరాయి మూకలతో బీజేపీ చేస్తున్న దాడులు సరైనవి కావు: కాంగ్రెస్​ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
Next Article Nizamabad Premier League Nizamabad Premier League | క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్ నిర్వహణ : సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?