అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Industrial Development | ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని(Yellareddy news) వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి, అక్కడ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME) ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్(Mla Madan Mohan) కోరారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రస్తావించారు.
Yellareddy Industrial Development | ప్రాంతీయ అభివృద్ధి కోసం..
ప్రాంతీయ అభివృద్ధి కోసం సరైన ప్రణాళికలు, సమర్థవంతమైన చర్యలు అత్యవసరమని ఆయన అసెంబ్లీలో అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రణాళికలు ఉంటే అభివృద్ధి ప్రారంభమౌతుందని.. చర్యలు తీసుకుంటే ప్రజల జీవితం మారుతుందని అని ఆయన స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అత్యంత అవసరమని, దీనికి పరిశ్రమల స్థాపన (industrial development) కీలకమని తెలిపారు.
Yellareddy Industrial Development | యువతకు ఉద్యోగాలు..
యువతకు ఉద్యోగాలు కల్పించడం రాజకీయ వాగ్దానం కాదు.. అది ప్రభుత్వ బాధ్యత(msme india) అని ఆయన గుర్తు చేశారు. ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం(job creation) ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు పెరిగి, వలసలు తగ్గి, ప్రజలు ఆర్థికంగా బలపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఇది కూడా చదవండి: Olympiad Education Benefits | ఒలంపియాడ్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు..

