అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Police | కుటుంబ కలహాలు, మద్యం అలవాట్ల కారణంతో ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో(Yellareddy) పట్టణంలో శుక్రవారం వెలుగుచూసింది.
Yellareddy Police | ఎల్లారెడ్డి పట్టణంలోని..
ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన అన్నారం యాదగిరి(53) భార్య నాలుగేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి యాదగిరి మద్యానికి (alcohol addiction issue) బానిసయ్యారు. దీనికితోడు తన ఇద్దరు కొడుకులతో నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో (family disputes ) యాదగిరి మద్యం తాగి, ఇంటికి వచ్చి తన చిన్న కుమారుడితో డబ్బులు కావాలని గొడవ పడ్డారు.
దీంతో ఇద్దరు కుమారులు అతడిని మందలించగా, తండ్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. అయితే శుక్రవారం సాయంత్రం(local news Telangana) ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద యాదగిరి పర్సు, టవల్ కనిపించాయి.
అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు (Yellareddy police) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా.. యాదగిరి మృతదేహం లభించింది. బాడీని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి (police investigation case) తరలించారు.
తన తల్లి మరణించినప్పటి నుంచి తండ్రి మద్యానికి బానిసై జీవితం మీద విరక్తి చెంది చెరువులో(suicide report India) దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పెద్ద కుమారుడు మణికంఠ చారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Old Pillow Effects | ఒకే దిండును ఏళ్ల తరబడి వాడుతున్నారా.. అయితే గ్యారెంటీగా ఇవి..!

