అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన కడెం తహశీల్దార్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ డిప్యూటీ కలెక్టర్‌గా ప్రమోషన్‌పై ఎల్లారెడ్డి ఆర్డీవోగా నియమితులయ్యారు.
Yellareddy RDO Prabhakar | సమస్యల పరిష్కారానికి కృషి
దీంతో బుధవారం ఆయనకు కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించి స్వాగతించారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం కార్యాలయం సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఎల్లారెడ్డి డివిజన్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి రెవెన్యూ సమస్యలు తలెత్తినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఎల్లారెడ్డి ఆర్డీవోగా విధులు నిర్వహించిన పార్థ సింహారెడ్డి చేవెళ్లేకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి..: RDO Parthasarathi Reddy | ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయం

