అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Transport Issues | ఎల్లారెడ్డి ప్రజల రవాణా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మదన్మోహన్(Mla madan Mohan) కోరారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను(Minister Ponnam Prabhakar) గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో కలిసి విన్నవించారు.
Yellareddy Transport Issues | బస్సుల కొరత
అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి జూపల్లి కృష్ణరావు అధ్యక్షతన ప్రిన్సిపాల్ సెక్రెటరీ, టీజీఎస్ఆర్టీసీ(TGSRTC updates) ఎండీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో’(public transport issues) విద్యార్థులు (పాఠశాల, కళాశాల), ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను వివరంగా తెలియజేశారు. ముఖ్యంగా బస్సుల కొరత,(bus shortage India) సమయపాలన లోపం, సరైన మౌలిక సదుపాయాల లేమి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Yellareddy Transport Issues | ఎల్లారెడ్డిలో కొత్త బస్ డిపో..
ఎల్లారెడ్డికి కొత్త బస్(bus depot demand ) డిపో మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి,(Telangana politics ) మెదక్, నిజామాబాద్, బాన్సువాడ ప్రాంతాలకు అధిక రద్దీ ఉన్న మార్గాల్లో అదనపు బస్సులు నడపాలన్నారు. ప్రధాన ప్రాంతాల వద్ద కొత్త బస్ షెల్టర్లు నిర్మించాలని.. బస్ స్టాండ్ల(Telangana transport) అభివృద్ధి, మరమ్మతులు చేయించాలని ఆయన మంత్రిని కోరారు. తాడ్వాయి బస్టాండ్‌లో మరమ్మతులు, కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, గాంధారిలో వర్షం నీరు ప్లాట్‌ఫారంపై నిల్వ కాకుండా సీసీ డ్రెయిన్ల నిర్మాణం, విద్యుత్ నిర్వహణ, శానిటేషన్ కోసం కొత్త బోర్‌వెల్ ఏర్పాటు, రామారెడ్డిలో సాధారణ మరమ్మతులు, మరుగుదొడ్ల సదుపాయాలు సమకూర్చాలని ఆయన కోరారు.
కొత్త బస్ షెల్టర్ల కోసం..
నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద, పోచారం, బంజారా తండా, తాండూర్, (infrastructure development)ధర్మారెడ్డి, రాఘవపల్లి, జలాల్‌పూర్, కన్నారెడ్డి, మెల్లకుంట తండా, ఆత్మకూర్ ప్రాంతాల్లో కొత్తగా బస్ షెల్టర్ల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమర్‌పేట్, తిమ్మారెడ్డి, శివనగర్, ఆడివిలింగాల్, లింగంపేట్‌లోని కొట్టాల్, మోతే, తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజీవాడిలోనూ షెల్టర్ల అవసరం ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Congress Party Positions | కష్టపడ్డ వారికే పార్టీలో పదవులు: డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

