అక్షరటుడే,ఎల్లారెడ్డి: Young India School Construction | యంగ్ ఇండియా స్కూల్ (Young India School) భవనాలను నాణ్యతతో నిర్మించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ఈ మేరకు జుక్కల్ జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలో (Madnur Mandal) నిర్మాణంలో ఉన్న స్కూల్ పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
Young India School Construction | స్వాగతం పలికిన డీసీసీ అధ్యక్షుడు..
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ కలెక్టర్‌ను మండల కేంద్రానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్కూల్ నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను సమగ్రంగా పరిశీలించారు. పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అక్కడి కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
Young India School Construction | పదోతరగతి పరీక్ష కేంద్రం తనిఖీ..
అంతకు ముందు మద్నూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధుల హాజరు శాతం, సౌకర్యాలపై విద్యాశాఖ అధికారి రాజును అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను పరిశీలించి విద్యార్ధుల ఆరోగ్య, భద్రత దృష్ట్యా వైద్య సిబ్బంది, అవసరమైన మెడిషన్ను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Municipal Budget | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం ప్రారంభం

