అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Youth Drug Awareness | యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarasimha) సూచించారు. ముఖ్యంగా ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకోవడంతో హెచ్‌ఐవీ, ఇతర రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు.
హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో కేబుల్ బ్రిడ్జ్‌పై నిర్వహించిన మానవహారం కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, మానవ హారాలు, మెడికల్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. రక్షణలేని లైంగిక సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి వంటి కారణాలతో హెచ్‌ఐవీ (HIV) వ్యాపిస్తుందని తెలిపారు
Youth Drug Awareness | అవగాహన లేక..
షేక్ హ్యాండ్, ఆలింగనం, కలిసి భోజనం చేయడం వంటి సాధారణ పరిచయాల ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించదని మంత్రి తెలిపారు. అవగాహన లేకపోవడంతో భయాలు, అపోహలు, వివక్ష పెరుగుతున్నాయని చెప్పారు. హెచ్‌ఐవీ బాధితులను సామాజికంగా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. వారికి గౌరవం, సహాయం, సమాన హక్కులు కల్పించాలని పేర్కొన్నారు.
Youth Drug Awareness | ప్రాణాంతకం కాదు
ఒక్కప్పుడు హెచ్‌ఐవీ ప్రాణాంతక వ్యాధి అని మంత్రి పేర్కొన్నార. కానీ ప్రస్తుతం సమయానికి పరీక్షలు, చికిత్స తీసుకుంటే నాలుగైదు దశాబ్దాలు కూడా సాధారణ జీవితాన్ని గడపవచ్చని వెల్లడించారు. ప్రభుత్వం ఉచితంగా టెస్టులు, చికిత్స, మందులు అందిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 127 టెస్టింగ్ సెంటర్లు, 33 ART సెంటర్ల ద్వారా 1.14 లక్షల మంది పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. యువతకు సెడెంటరీ లైఫ్ స్టైల్, అనారోగ్యకర అలవాట్లతో జీవితాన్ని పాడు చేసుకోవద్దని ఆయన సూచించారు. ఆరోగ్యం లేకుంటే ఎంత మంచి సంపాదన ఉన్నా వృథానే అన్నారు.
ఇది కూడా చదవండి..: BRS Plenary Plan | బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సాదాసీదా ప్లీనరీ.. కేసీఆర్ కొత్త వ్యూహం?
