అక్షరటుడే, భీమ్‌గల్: Youth Job Promises | ఎన్నికల ముందు ‘యూత్ డిక్లరేషన్’, ‘జాబ్ క్యాలెండర్’ పేరిట కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని బాల్కొండ నియోజకవర్గ (Balkonda Constituency) బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం నాయకులు విమర్శించారు. వేల్పూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం ఏర్పాటు చేశారు.
Youth Job Promises | అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా..
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా, మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిల చెల్లింపు వంటి అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి అవమానించారని, విద్యా భరోసా కార్డులు, ఎలక్ట్రిక్ స్కూటర్ల హామీలు ఎటు వెళ్లాయని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ కాస్త ‘జీరో క్యాలెండర్’ గా మారిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బాబాపూర్ శ్రీనివాస్, నలీన్, కొత్తపల్లి రఘు, బోట్ల రామకృష్ణ, కిట్టు, అశోక్, రాజు, రాజేష్, విగ్నేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Prajavani Complaints | ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

