Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: YS Jagan Corruption Allegations | రాష్ట్రంలో భారీగా అవినీతి : వైఎస్​ జగన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - YS Jagan Corruption Allegations | రాష్ట్రంలో భారీగా అవినీతి : వైఎస్​ జగన్​

ఆంధ్రప్రదేశ్​

YS Jagan Corruption Allegations | రాష్ట్రంలో భారీగా అవినీతి : వైఎస్​ జగన్​

కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్​ విమర్శలు చేశారు. రాష్ట్రంలో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 5:24 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
YS Jagan Corruption Allegations

అక్షరటుడే, వెబ్​డెస్క్: YS Jagan Corruption Allegations | రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్​ (YSRCP Chief Jagan) అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దోచుకో, పంచుకో ఇదే జరుగుతోందన్నారు. ఇసుక, మట్టి, లిక్కర్, భూమి దేనిని వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా దోచేస్తుంటే ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు.

Contents
  • YS Jagan Corruption Allegations | ఎమ్మెల్యేల ఆటలు
    • YS Jagan Corruption Allegations | పాలు తాగినా చనిపోతున్నారు..

విశాఖలో రూ.5 వేల కోట్ల విలువైన భూమిని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తన సమీప బంధువుకు కట్టబెట్టారని జగన్​ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు అతి తక్కువ ధరకు భూములు ఇస్తున్నారన్నారు. అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. 2024-25లో రూ.80 వేల కోట్ల అప్పులు చేశారన్నారు. తమ హయాంలోని పథకాలను కూడా రద్దు చేశారని చెప్పారు. కూటమి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎన్బీసీ పరిమితి కన్నా రూ.12 వేల కోట్లకు పైగా అప్పులు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3.80 లక్షల కోట్ల అప్పు చేసిందని జగన్​ పేర్కొన్నారు. తమ పాలనలో ఐదేళ్లలో రూ.3.30 లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేశామని తెలిపారు.

YS Jagan Corruption Allegations | ఎమ్మెల్యేల ఆటలు

రైతులు (Farmers) ఇబ్బందుల్లో ఉంటే ఎమ్మెల్యేలు ఆటలు, పాటలు పాడుకుంటున్నారని జగన్​ విమర్శించారు. రైతులు కష్టకాలంలో ఉంటే స్కిట్‌లు ఏమిటని ప్రశ్నించారు. రైతులకు భరోసా ఇవ్వాల్సిందిపోయి కాలక్షేపం చేశారని మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారని నిలదీశారు.

YS Jagan Corruption Allegations | పాలు తాగినా చనిపోతున్నారు..

చంద్రబాబు పాలనలో పాలు, నీళ్లు తాగినా చనిపోతున్నారని జగన్​ అన్నారు. ఇటీవల రాజమండ్రి కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్​ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయన్నారు. వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేశారని ఆరోపించారు. చంద్రన్న కానుకకే దిక్కులేదని, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తానంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి..: Tirumala Darshan Rules | తిరుమల భక్తులకు అలెర్ట్​.. శ్రీవారి దర్శనానికి కఠిన నిబంధన!

Palamaneru Road Accident | పలమనేరు బైపాస్‌లో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు దుర్మరణం
Social Media Ban Kids | 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్​ మీడియా బ్యాన్ ​: ఏపీ సీఎం చంద్రబాబు
Students Drowned | గోదావరిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు
bribery case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు కార్యదర్శి
Ramzan Holiday in AP | రంజాన్ సెలవు తేదీ మార్పు.. మార్చి 21కు షిఫ్ట్, పదో తరగతి పరీక్ష వాయిదా
TAGGED:CM ChandrababuFarmersYS Jagan Corruption AllegationsYSRCP Chief Jagan
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article New DGP Selection New DGP Selection | కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు.. రేసులో వీరే..
Next Article Induction Stove Demand Induction Stove Demand | మార్కెట్‌లో గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌ స్టాక్ లకు పెరిగిన డిమాండ్
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?