అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hormuz Strait Open | హర్మూజ్ జలసంధి దిగ్బంధనంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల కోసం హర్మూజ్‌ను తెరిచి ఉంచామని ప్రకటించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. అమెరికా సైతం హర్ముజ్‌ను దిగ్భందించింది. దీంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచంలో ఇంధన, గ్యాస్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని అనేక దేశాలు ఆందోళన చెందాయి. ఈ క్రమంలో హర్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరుస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాదన్నారు.
Hormuz Strait Open | చైనా హామీ ఇచ్చింది
తమ నిర్ణయం పట్ల చైనా (China) సంతోషంగా ఉందని ట్రంప్ అన్నారు. త్వరలో చైనాలో పర్యటిస్తానని చెప్పారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా హామీ ఇచ్చిందన్నారు. ఇరాన్‌కు తమ దేశం ఎలాంటి సైనిక మద్దతు ఇవ్వడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవలి రోజుల్లో పదేపదే ఖండించింది. అమెరికా ప్రభుత్వం ప్రకారం చైనా చాలా కాలంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి మద్దతు ఇస్తోంది, క్షిపణి ఉత్పత్తికి ఉపయోగపడే ద్వంద్వ-ఉపయోగ పారిశ్రామిక భాగాలతో దానికి అండగా నిలుస్తోంది.
Hormuz Strait Open | చైనాలో పర్యటిస్తా..
మే నెలలో తాను బీజింగ్‌లో పర్యటిస్తానని ట్రంప్ తెలిపారు. ఆ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తనను ఆప్యాయంగా కౌగలించుకుంటారని పేర్కొన్నారు. తాము తెలివిగా, కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. కాగా మే 14, 15 తేదీల్లో ట్రంప్ చైనాలో పర్యటించనున్నారు. కాగా హర్ముజ్ జలసంధి మూసివేతను ఇటీవల చైనా ఖండించింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి : Trump Modi Call | మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. హర్ముజ్ జలసంధిపై చర్చ
