అక్షరటుడే, భీమ్‌గల్ : Bheemgal Police | పట్టణంలోని బాపూజీనగర్ కాలనీలో సాగుతున్న వ్యభిచార దందా వ్యవహారాన్ని పోలీసులు (police raid) గుట్టురట్టు చేశారు. భీమ్‌గల్(bheemgal news) ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం భీమ్‌గల్ పోలీసులు (Bheemgal Police) ఓ నివాసంపై ఆకస్మిక దాడి నిర్వహించి, నలుగురు పురుషులు సహా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
Bheemgal Police | వివరాల్లోకి వెళ్తే..
మండల కేంద్రంలోని బాపూజీనగర్‌లో చందు, కమలేష్ ఇద్దరు వ్యక్తులు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, బయట వ్యక్తులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసుల దాడి సమయంలో ఓ వ్యక్తితో పాటు ఓ మైనర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ.2,450 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాంమని హెచ్చించారు. నిందితులను రిమాండ్‌కు తరలించి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు.
కౌన్సెలింగ్‌కు తరలింపు
ఈ ముఠా చెర నుంచి రక్షించబడిన(human trafficking) ఇద్దరు మహిళలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారికి నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ ఇచ్చి, అవసరమైన ప్రభుత్వ సహాయాన్ని అందజేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AE Caught by ACB | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ
