అక్షరటుడ, నిజామాబాద్ అర్బన్: TNGOs employees | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్(TNGOs union) కృషి చేస్తుందని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ (Nashetti Suman Kumar) అన్నారు. ఆ మేరకు బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో టీఎన్జీవోస్ బోధన్ యూనిట్‌ను నూతనంగా ఎన్నుకున్నారు.
TNGOs employees | ఉద్యోగులకు వెన్నుదన్నుగా నిలవాలి..
బోధన్ యూనిట్ ఎన్నిక అనంతరం సుమన్ కుమార్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. బోధన్ యూనిట్ అధ్యక్షుడిగా కార్తీక్ (ట్రెజరీ శాఖ), కార్యదర్శిగా సాయిలు (వ్యవసాయ శాఖ) తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. వ్యవసాయ శాఖ(Department of Agriculture) రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ వనమాల సుధాకర్ ఎన్నికల అధికారిగా, సహాయక ఎన్నికల అధికారిగా జాఫర్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయన్నారు.
కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీష్, టీఎన్జీవో నిజామాబాద్ అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, ఆర్మూర్ యూనిట్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు శశికాంత్ రెడ్డి, విశాల్, టీఎన్జీవో భీమ్‌గల్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సృజన్ కుమార్, సాయికుమార్, రూరల్ యూనిట్ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం, జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మ, గంగరాజు, మహేందర్, శ్రీనివాస్, స్వామి,భూమయ్య బోధన్ యూనిట్ ఉద్యోగులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Telangana Heat Wave | మండుతున్న ఎండలు.. ఈ నాలుగు రోజులు జాగ్రత్త
