Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 16 Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - April 16 Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

బిజినెస్​తాజా వార్తలు

April 16 Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ఆసియా మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. మన మార్కెట్లు గ్యాప్ అఫ్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 16, 2026 8:31 ఉద.
Naresh chandan
4 రోజులు ago
Share
April 16 Pre Market Analysis
April 16 Pre Market Analysis

అక్షరటుడే, వెబ్​డెస్క్​: April 16 Pre Market Analysis | యూఎస్ -ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలలో పురోగతిపై ఆశలతో వాల్ స్ట్రీట్‌(Wallstreet)లో పెట్టుబడిదారులు ఉత్సాహంగా ఉన్నారు. దీంతో గత సెషన్‌లో వాల్ స్ట్రీట్ లాభాలతో ముగిసింది.

Contents
  • April 16 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
    • April 16 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
      • ఆసియా మార్కెట్లు..
      • గమనించాల్సిన అంశాలు..

ప్రధాన ఆసియా మార్కెట్లు గురువారం ఉదయం కూడా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సైతం గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

April 16 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..

నవంబర్ 2021 తర్వాత తొలిసారిగా నాస్‌డాక్ వరుసగా 11 సెషన్లలో లాభాలను నమోదు చేసింది. గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 1.59 శాతం, ఎస్ అండ్ పీ 0.80 శాతం లాభపడగా.. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.15 శాతం లాభంతో ఉంది.

April 16 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.09 శాతం లాభపడగా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.64 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.47 శాతం నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ 2.51 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.08 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.29 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.64 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.52 శాతం లాభంతో ఉన్నాయి. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.30 శాతం నష్టంతో కదలాడుతోంది. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.28 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 666 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డీఐఐలు వరుసగా 31 సెషన్ల తర్వాత నికర అమ్మకందారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 569 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.13 నుంచి 1.12కు తగ్గింది.
  • విక్స్ 8.94 శాతం తగ్గి 18.67 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.02 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.28 వద్ద ఉన్నాయి.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 95.20 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక పైస బలపడి 93.38 వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: Summer Holidays | వేసవి సెలవుల్లో పిల్లలకు సరదా.. అదనపు స్కిల్స్​ అందించే చిట్కాలు ఇవిగో!

Stock Market Gains | సీజ్ ఫైర్ ఎఫెక్ట్ .. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Kidney Stones Beer Myth | బీరు తాగితే కిడ్నీ రాళ్లు కరుగుతాయా.. నిపుణులు ఏమి చెబుతున్నారంటే!
Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!
April 02 Horoscope | హనుమాన్​ దయ.. సన్నిహితుల ఆర్థిక చేయూత.. ఈ రాశుల వారికి ఇక రాజయోగం పక్కా!
Hyderabad Samosa Raid | హైదరాబాద్‌లో సమోసాల తయారీ కేంద్రంపై దాడి.. రూ. 5 లక్షల విలువైన ఆహార పదార్థాల స్వాధీనం
TAGGED:asian marketsGift Niftyglobal markets updateNifty TodayPre Market Analysisstock market indiastock market trendswall street news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Summer Holidays Summer Holidays | వేసవి సెలవుల్లో పిల్లలకు సరదా.. అదనపు స్కిల్స్​ అందించే చిట్కాలు ఇవిగో!
Next Article Mantralayam Road Accident Mantralayam Road Accident | మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో-లారీ ఢీ.. 8 మంది దుర్మరణం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?