Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mantralayam Road Accident | మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో-లారీ ఢీ.. 8 మంది దుర్మరణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Mantralayam Road Accident | మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో-లారీ ఢీ.. 8 మంది దుర్మరణం

ఆంధ్రప్రదేశ్​తాజా వార్తలు

Mantralayam Road Accident | మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో-లారీ ఢీ.. 8 మంది దుర్మరణం

కర్నూల్ జిల్లాలోని మంత్రాలయం సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పుణ్యక్షేత్రం దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 16, 2026 8:38 ఉద.
Naresh chandan
13 గంటలు ago
Share
Mantralayam Road Accident
Mantralayam Road Accident

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mantralayam Road Accident | కర్నూల్ Kurnool జిల్లాలో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో బొలెరో వాహనం మరియు లారీ ఢీకొన్న ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Contents
  • Mantralayam Road Accident | తిరుగు ప్ర‌యాణంలో మృతి..
    • Mantralayam Road Accident | అజాగ్ర‌త్త వ‌ల్ల‌నే

ఈ ప్రమాదంలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని అత్యవసరంగా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయాల తీవ్రత కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

Mantralayam Road Accident | తిరుగు ప్ర‌యాణంలో మృతి..

మృతుల్లో అమృత, తేజస్వని, ధన్య, దీపక్, దీక్షిత, ప్రతాప్, కుమార్‌లను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. మరో మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. వీరంతా కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మంగళూరు జిల్లా కనకాయహల్లి గ్రామానికి చెందినవారని అధికారులు తెలిపారు.

ఇప్పటికే బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మంత్రాలయం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం Accident చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Mantralayam Road Accident | అజాగ్ర‌త్త వ‌ల్ల‌నే

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అధిక వేగం Over Speed లేదా రహదారి పరిస్థితులు కారణమా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదాల‌కి చాలా మంది మృత్యువాత ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఎన్నిహెచ్చ‌రికలు జారీ చేసిన కూడా కొంద‌రు అజాగ్ర‌త్త వ‌ల్ల‌నే ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి.

ఇది కూడా చదవండి: Child Choking First Aid | పిల్లల గొంతులో ఏదైనా వస్తువు ఇరుక్కుపోయిందా.. ప్రమాదం నుంచి గట్టెక్కించే మార్గం ఇదే!

BC Reservation Protest | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్​.. బీఆర్​ఎస్​ సభ్యుల నిరసన
Badam Milk Incident | జాతరలో విక‌టించిన బాదం పాలు.. 80 మందికి అస్వస్థత, ఆసుపత్రుల్లో చికిత్స
Sonia Gandhi Health | సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీ గంగారాం ఆసుపత్రికి తరలింపు!
Hyderabad Rain Traffic | ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్​… హైదరాబాద్​లో వాహనదారుల ఇక్కట్లు!
Seema Anand Controversy | తెరపైకి సెక్స్​ ఎడ్యుకేటర్​ సీమా ఆనంద్ వివాదం.. పోడ్‌కాస్ట్ వ్యాఖ్యలపై చర్చ!
TAGGED:Andhra Pradesh Newsbolero crashbreaking news IndiaIndia road safetykurnool accidentmantralayam accidentMantralayam Road AccidentRoad Accident Indiatraffic accident
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article April 16 Pre Market Analysis April 16 Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Next Article Telangana Caste Survey Telangana Caste Survey | వెలుగులోకి కుల గణాంక సర్వే వివరాలు.. టాప్​లో 35 కులాలు ఇవే…
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?