Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతిష్టాత్మక ఆర్టిస్ట్రీ స్టోర్ ప్రారంభం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతిష్టాత్మక ఆర్టిస్ట్రీ స్టోర్ ప్రారంభం

హైదరాబాద్

హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతిష్టాత్మక ఆర్టిస్ట్రీ స్టోర్ ప్రారంభం

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 16, 2026 11:21 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
malabar

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 వేదికగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన సరికొత్త ఆర్టిస్ట్రీ స్టోర్‌ను అత్యంత వైభవంగా ప్రారంభించింది. భారతీయ ఆభరణాల రంగంలోనే ఇదొక విశిష్టమైన లగ్జరీ గమ్యస్థానంగా నిలవనుంది. కేవలం ఆభరణాల విక్రయ కేంద్రంగానే కాకుండా వినియోగదారులకు వ్యక్తిగత ప్రాధాన్యతను ఇస్తూ వారి అభిరుచులకు అనుగుణంగా అత్యుత్తమ కళానైపుణ్యంతో కూడిన ఆభరణాలను అందించడమే లక్ష్యంగా ఈ స్టోర్ రూపుదిద్దుకుంది. విశ్వసనీయత ప్రత్యేకమైన కొనుగోలు అనుభూతిని కలగజేస్తూ రిటైల్ రంగంలో ఇదొక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.

కరీనా చేతుల మీదుగా..
ప్రముఖ సినీ నటి కరీనా కపూర్ ఖాన్ ఈ మెగా స్టోర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ తో పాటు ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆషర్ ఓ రిటైల్ హెడ్ సిరాజ్ పి.కె. అలాగే జోనల్ హెడ్ ముహమ్మద్ షరీజ్ కె. వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎం.పి. అహమ్మద్ మాట్లాడుతూ మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక మార్పులు చేస్తూ ఈ ఆర్టిస్ట్రీ స్టోర్‌ను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. నాణ్యత పారదర్శకతకు పెద్దపీట వేస్తూ దీర్ఘకాలిక విలువలను అందించడమే తమ నిరంతర లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

కరీనా కపూర్ ఖాన్ ఈ స్టోర్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంటూ నేటి కాలంలో ఆభరణాలు అంటే కేవలం అలంకరణ మాత్రమే కాదని అవి ఒక వ్యక్తి గుర్తింపును వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. ఇక్కడి ప్రతి ఆభరణం వెనుక ఉన్న శ్రద్ధ కస్టమర్ల పట్ల చూపే గౌరవం ఈ అనుభూతిని మరింత విలాసవంతంగా మార్చాయని ఆమె ప్రశంసించారు. సుమారు 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టోర్ కేవలం విక్రయాలకే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయి డిజైన్లు అత్యాధునిక సౌకర్యాలతో వినియోగదారులకు ఒక మధురమైన అనుభవాన్ని పంచుతోంది.

Hyderabad traffic restrictions | శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
Hyderabad Drug Bust | నగరంలో డ్రగ్స్​, గంజాయి విక్రయాలు.. పలువురి అరెస్ట్​
Chicken Shops Bandh | ఏప్రిల్1 నుంచి చికెన్ షాపులు బంద్!
Mangalhat Cordon Search | కార్డన్​ సెర్చ్​లో సిలిండర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Gas Cylinder Black Market | బ్లాక్​లో సిలిండర్ల విక్రయం.. 10 మంది అరెస్ట్
TAGGED:Bespoke CraftsmanshipCurated CollectionsHyderabad Artistry StoreJubilee HillsKareena Kapoor KhanLuxury JewelleryM. P. AhammadMalabar Gold & DiamondsPremium Retail ExperienceRelationship-led Retail
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Singer Mangli Statement Singer Mangli Statement | నేను ఏ తప్పు చేయలేదు.. సింగర్​ మంగ్లీ
Next Article VinFast VF MPV 7 VinFast VF MPV 7 | ‘విన్‌ఫాస్ట్’ నుంచి మరో ఈవీ కారు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?