Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: VinFast VF MPV 7 | ‘విన్‌ఫాస్ట్’ నుంచి మరో ఈవీ కారు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - VinFast VF MPV 7 | ‘విన్‌ఫాస్ట్’ నుంచి మరో ఈవీ కారు..

బిజినెస్​

VinFast VF MPV 7 | ‘విన్‌ఫాస్ట్’ నుంచి మరో ఈవీ కారు..

విన్‌ఫాస్ట్ కంపెనీ ప్రీమియం విద్యుత్ మల్టీ పర్పస్ వెహికల్ ‘వీఎఫ్ ఎంపీవీ 7’ను ఆవిష్కరించింది. బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 16, 2026 11:26 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
8 గంటలు ago
Share
VinFast VF MPV 7

అక్షరటుడే, వెబ్​డెస్క్ : VinFast VF MPV 7 | వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన (Electric vehicle) తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ సరికొత్త ప్రీమియం విద్యుత్ మల్టీ పర్పస్ వెహికల్ ‘వీఎఫ్ ఎంపీవీ 7’ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ప్రధానంగా ఫ్లీట్(కమర్షియల్) ఆపరేటర్లను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు.

Contents
  • VinFast VF MPV 7 | ఇంటీరియర్, ఫీచర్లు
    • VinFast VF MPV 7 | పవర్‌ట్రైన్, పర్ఫార్మెన్స్..
      • VinFast VF MPV 7 | బుకింగ్స్ ప్రారంభం..

దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 517 కిలోమీటర్లు(ఏఆర్ఏఐ సర్టిఫైడ్) ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఏడు సీట్లు కలిగిన ఈ కారు ప్రారంభ ధర (ఎక్స్ షోరూం)ను రూ.24.49 లక్షలుగా నిర్ణయించారు. ప్రస్తుతం దేశీయ విపణిలో వీఎఫ్6, వీఎఫ్7 విద్యుత్ కార్లను కంపెనీ విక్రయిస్తోంది. ప్రస్తుతం విడుదల చేసినది మూడో ఎంపీవీ. దీని ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.

డిజైన్ : ‘వీఎఫ్ ఎంపీవీ 7’ మోడల్ అధునాతన డిజైన్ లాంగ్వేజ్‌తో ఆకట్టుకుంటోంది. ఇది 4,740 మిమీ పొడవు, 1,872 మిమీ వెడల్పు, 1,734 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. 1,240 లీటర్ల భారీ స్టోరేజ్ సామర్థ్యం ఉంది.

ఎక్స్‌టీరియర్ : ముందు భాగంలో విన్‌ఫాస్ట్ సిగ్నేచర్ ‘ఏ’ లోగోతో కూడిన ఎలఈడీ డీఆరఎల్‌లున్నాయి. నిలువుగా ఉండే హెడ్ ల్యాంప్స్ దీనికి ప్రత్యేక లుక్‌ని ఇస్తాయి. 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనక వైపు కారు వెడల్పు పొడవునా ఉండే టెయిల్ లైట్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

VinFast VF MPV 7 | ఇంటీరియర్, ఫీచర్లు

క్యాబిన్ లోపల 10.1 అంగుళాల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఉన్నాయి. యూఎస్‌బీ -ఏ, యూఎస్‌బీ -సీ చార్జింగ్ పోర్ట్‌లు ఇచ్చారు. ఆల్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(టీపీఎంఎస్), ఆటో హోల్డ్ ఫీచర్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి భద్రతా ప్రమాణాలు కూడా ఉన్నాయి.

VinFast VF MPV 7 | పవర్‌ట్రైన్, పర్ఫార్మెన్స్..

60.1 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
201 హెచ్‌పీ శక్తిని, 280 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 140 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. ఇది మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్ ఆప్షన్లతో లభిస్తుంది.

VinFast VF MPV 7 | బుకింగ్స్ ప్రారంభం..

‘వీఎఫ్ ఎంపీవీ 7’ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తిగలవారు రూ. 21 వేల టోకెన్ మొత్తంతో కారును బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ద్వితీయార్థంలో డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది చివరలో ‘లిమో గ్రీన్’ (‘Limo Green’)పేరుతో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి కమర్షియల్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: LIC New Apps | ఎల్ఐసీ మరో ముందడుగు.. రెండు కొత్త యాప్‌ల ఆవిష్కరణ

Ola Electric Sales Growth | ఓలా.. అమ్మకాలు భళా!
Godrej Interio | భాగ్యనగర వాసుల సుఖవంతమైన నిద్రకు కారణమిదే..
సహజ వనరుల సామర్థ్యాన్ని వెలికితీస్తే భారత్ దిగుమతుల భారాన్ని తగ్గించవచ్చు: వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్
Gold Silver Rates Today | భగ్గుమంటున్న పసిడి ధరలు.. ఆదివారం గోల్డ్, సిల్వర్ రేట్లు ఇలా ఉన్నాయి!
Crude Oil Prices Drop | సీజ్ ఫైర్ ప్రకటన.. భారీగా పడిపోయిన చమురు ధరలు
TAGGED:‘Limo Green’electric car launchelectric MPVElectric vehicleEV IndiaEV range 517 kmpremium electric vehicleVF MPV 7VinFastVinFast IndiaVinFast VF MPV 7
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article malabar హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతిష్టాత్మక ఆర్టిస్ట్రీ స్టోర్ ప్రారంభం
Next Article Stock Market Gains Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?