అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Road Safety Awareness | ట్రాఫిక్ నియమాలు పాటించి, రోడ్డు ప్రమాదాలు నివారిద్దామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆటో, అంబులెన్స్ డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు.
Road Safety Awareness | రోడ్డు ప్రమాదాలే ఎక్కువ..
ఈ సందర్భంగా సీపీ (CP Sai Chaitanya) మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రతిఒక్కరి ద్వారా రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలకు (road accidents) ప్రధాన కారణాలు అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడమేనన్నారు.
Road Safety Awareness | చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు నాంది..
చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని.. అలాంటి సంఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని సీపీ తెలిపారు. కోవిడ్ సమయంలో జిల్లావ్యాప్తంగా దాదాపు 200 మంది మృతిచెందగా 2025లో జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వలన 302 మంది తమ ప్రాణాలను కోల్పోయారని వివరించారు. రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగి.. మరణాలు జరుగుతున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ (Golden Hour)లో గాయపడిన వ్యక్తిని ఎవరైనా హాస్పిటల్కు తరలిస్తే అతనికి ప్రభుత్వం నుంచి రూ.25 వేల ప్రోత్సాహకం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి జె.ఉమామహేశ్వరరావు, నిజామాబాద్ ఇన్ఛార్జి ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్, టౌన్ వన్ ఎస్హెచ్వో రఘుపతి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, జీఆర్పీ ఎస్హెచ్వో లింబాద్రి, టౌన్ వన్ ఎస్సై సుమలత, 34వ డివిజన్ కార్పొరేటర్ బంటు ప్రీతి ప్రవీణ్ కుమార్, ఆటో డ్రైవర్లు, అంబులెన్స్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Road Safety Awareness | రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి: అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్
