అక్షరటుడే, ఎల్లారెడ్డి: MeeSeva ACB raids | రాష్ట్రవ్యాప్తంగా పలు మీసేవా కేంద్రాలపై (meeseva raids) ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పలు పత్రాలను వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారు గురువారం వివరాలు వెల్లడించారు.
MeeSeva ACB raids | సర్టిఫికెట్ల పేరుతో అధిక వసూళ్లు..
రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌తో (Hyderabad) సహా సుమారు 11 మీసేవా సెంటర్లపై ఏసీబీ(acb telangana) అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సెంటర్లలో అధిక వసూళ్లకు పాల్పడడం, కొన్ని సెంటర్లలో బ్రోకర్లు తిష్టవేసి సర్టిఫికెట్లు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా వారు గుర్తించారు. ఈ క్రమంలో నిజామాబాద్ నగరంలోని (Nizamabad) శివాజీనగర్‌లో ఉన్న మీసేవా కేంద్రాన్ని సైతం తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాల్లో సిబ్బంది, మధ్యవర్తులు, ఏజెంట్లు, అధికారుల మధ్య అనేక అనధికారిక ఆర్థిక లావాదేవీలు, వాట్సాప్ చాట్‌లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. చాలా మీ సేవా కేంద్రాలు దరఖాస్తుదారుల నుండి అధిక మొత్తాలను వసూలు చేస్తున్నట్లు వారి విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో, మీ సేవా కేంద్రాల్లో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని అధికారులు కోరారు.
ఇది కూడా చదవండి: Stock Market Loss | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సూచీలు
