అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Loss | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైనా.. నిలదొక్కుకోలేకపోయింది. ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ప్రారంభ లాభాలు తగ్గాయి. ఉదయం సెన్సెక్స్ 566 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మరో 53 పాయింట్లు పెరిగింది.
అక్కడినుంచి 1,056 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 154 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 15 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 298 పాయింట్లు పడిపోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకుని చివరికి సెన్సెక్స్ 122 పాయింట్ల నష్టంతో 77,988 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 24,196 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Loss | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,808 కంపెనీలు లాభపడగా 1,539 స్టాక్స్ నష్టపోయాయి. 147 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 163 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 22 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Stock Market Loss | మిక్స్‌డ్‌గా సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ లో సూచీలు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ 1.53 శాతం, యుటిలిటీ 1.37 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.02 శాతం, పవర్ 0.92 శాతం, ఐటీ 0.88 శాతం లాభపడగా.. ఆటో 0.38 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.38 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.27 శాతం, టెలికాం 0.27 శాతం నష్టపోయాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 14 స్టాక్స్ లాభపడగా.. 16 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ట్రెంట్ 2.81 శాతం, ఎటర్నల్ 2.54 శాతం, అదానీపోర్ట్స్ 2.30 శాతం, బీఈఎల్ 1.81 శాతం, ఇన్ఫోసిస్ 1.05 శాతం లాభపడ్డాయి.
Top Losers : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.75 శాతం, టైటాన్ 1.45 శాతం, ఎంఅండ్ ఎం 0.99 శాతం, ఎయిర్‌టెల్ 0.82 శాతం, కొటక్ బ్యాంక్ 0.75 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: VinFast VF MPV 7 | ‘విన్‌ఫాస్ట్’ నుంచి మరో ఈవీ కారు..
